లాక్‌డౌన్‌కు చెక్.. జోరు పెంచిన మార్కెట్లు

లాక్‌డౌన్ కారణంగా నేల చూపులు చూసిన దేశీయ మార్కెట్లు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఒక్కొక్కటిగా సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటంతో మార్కెట్‌ లాభాల దారి పట్టింది. (జూన్01)సోమవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 879 పాయింట్లు లాభపడి, 33,303 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 9,826 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ […]

  • Sanjay Kasula
  • Publish Date - 6:00 pm, Mon, 1 June 20
లాక్‌డౌన్‌కు చెక్.. జోరు పెంచిన మార్కెట్లు

లాక్‌డౌన్ కారణంగా నేల చూపులు చూసిన దేశీయ మార్కెట్లు.. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. లాక్‌డౌన్‌ నిబంధనలు ఒక్కొక్కటిగా సడలిస్తూ ఆర్థిక కార్యకలాపాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుమతులు ఇస్తుండటంతో మార్కెట్‌ లాభాల దారి పట్టింది. (జూన్01)సోమవారం నాటి ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ 879 పాయింట్లు లాభపడి, 33,303 వద్ద ముగిసింది. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 245 పాయింట్ల లాభంతో 9,826 వద్ద స్థిరపడింది. ఈ ఉదయం దేశీయ మార్కెట్లు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. ఆరంభ ట్రేడింగ్‌లో బీఎస్‌ఈ సెన్సెక్స్‌ ఏకంగా 900 పాయింట్లు లాభపడింది. జూన్‌8 నుంచి దేశీయంగా విధించిన లాక్‌డౌన్‌ ఆంక్షలు మరిన్ని సడలించనున్నట్లు కేంద్ర హోంమంత్రిత్వశాఖ వెల్లడించడం కూడా మార్కెట్‌కు కలిసొచ్చింది.