ఆరంభంలో హుషారు.. సాయంత్రానికి కుదేలు..!

స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. ఉదయం హుషారెత్తించే ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన సెన్సెక్స్.. సాయంత్రానికి అమ్మకాల ఒత్తిళ్లకు తలొగ్గడంతో కుదేలపడింది. మార్కెట్ ఆరంభంలో 200కి పైగా పాయింట్లతో జోరుగా ప్రారంభమైంది సెన్సెక్స్. చివరికి 135 పాయింట్ల పతనంతో 39,140 వద్ద ముగిసింది. నిఫ్టీ పరిస్థితి కూడా అదే తీరులో సాగింది. ఉదయం 11,850 పాయింట్లతో రికార్డు స్థాయిలో ట్రేడింగ్ జరిగినా, సూచీల అండ లేకపోవడంతో సాయంత్రానికి నిరాశ పరిచింది. 34 పాయింట్ల నష్టంతో 11,753 వద్ద […]

ఆరంభంలో హుషారు.. సాయంత్రానికి కుదేలు..!

Edited By:

Updated on: Apr 18, 2019 | 7:20 PM

స్టాక్ మార్కెట్లు నేడు ఒడిదుడుకుల మధ్య ముగిశాయి. ఉదయం హుషారెత్తించే ఓపెనింగ్స్‌తో ప్రారంభమైన సెన్సెక్స్.. సాయంత్రానికి అమ్మకాల ఒత్తిళ్లకు తలొగ్గడంతో కుదేలపడింది. మార్కెట్ ఆరంభంలో 200కి పైగా పాయింట్లతో జోరుగా ప్రారంభమైంది సెన్సెక్స్. చివరికి 135 పాయింట్ల పతనంతో 39,140 వద్ద ముగిసింది. నిఫ్టీ పరిస్థితి కూడా అదే తీరులో సాగింది. ఉదయం 11,850 పాయింట్లతో రికార్డు స్థాయిలో ట్రేడింగ్ జరిగినా, సూచీల అండ లేకపోవడంతో సాయంత్రానికి నిరాశ పరిచింది. 34 పాయింట్ల నష్టంతో 11,753 వద్ద స్థిరపడింది.