ఉగ్రవాదులను చీల్చి చెండాడిన సిక్కోలు జవాన్…
ఆంధ్రా సైనికుడు బోర్డర్‌లో వీరుడిగా పోరాడాడు. ఓవైపు శరీరంలోకి బుల్లెట్లు దూసుకువస్తున్నా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. దీంతో దేశం మొత్తం ఇప్పుడు అతడికి సెల్యూట్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం చిన్న లొహరిబంద గ్రామానికి చెందిన తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నాడు. ఈ సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ముష్కరులను మట్టుబెట్టడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు. సోదరుడు కూడా దేశ సేవకే : చిన్నలొహరిబంద గ్రామంలో నివశించే తామాడ భైరాగి, కామమ్మ దంపతులకు […]
ఆంధ్రా సైనికుడు బోర్డర్‌లో వీరుడిగా పోరాడాడు. ఓవైపు శరీరంలోకి బుల్లెట్లు దూసుకువస్తున్నా ఇద్దరు ఉగ్రవాదులను మట్టుబెట్టాడు. దీంతో దేశం మొత్తం ఇప్పుడు అతడికి సెల్యూట్ చేస్తోంది. శ్రీకాకుళం జిల్లా మందస మండలం చిన్న లొహరిబంద గ్రామానికి చెందిన తామాడ దొరబాబు తొమ్మిదేళ్లుగా సైన్యంలో సేవలందిస్తున్నాడు. ఈ సోమవారం సాయంత్రం జరిగిన ఎన్‌కౌంటర్‌లో పాకిస్తాన్ ముష్కరులను మట్టుబెట్టడంలో అతడు కీలకంగా వ్యవహరించాడు.
సోదరుడు కూడా దేశ సేవకే :
చిన్నలొహరిబంద గ్రామంలో నివశించే తామాడ భైరాగి, కామమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు. పెద్దవాడు ఆనందరావు కూడా ఆర్మీ ఢిల్లీ విభాగంలో పనిచేస్తున్నాడు. రెండోవాడైన దొరబాబు జమ్మూ–కాశ్మీర్‌లో సేవలందిస్తున్నాడు. ఆ రాష్ట్రంలోని 1ఆర్‌ఆర్ బెటాలియన్‌లో దొరబాబు జవాన్‌గా ఉన్నారు. ఇటీవల మొత్తం 200 మంది జవాన్లతో కూడిన సెర్చ్‌టీంగా కోజ్‌పూర్ గ్రామంలో సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు. రెండిళ్లలో తనిఖీల అనంతరం..దగ్గర్లోని ఓ ఇంటి నుంచి ఒక్కసారిగా కాల్పులు ప్రారంభమయ్యాయి. ఏం జరిగిందో తెలుసుకునేలోపే దొరబాబు కాల్లోకి బుల్లెట్ చొచ్చుకెళ్లింది. అయినా అతడిలో పట్టు సడలలేదు. కిటికీ నుంచి ఇద్దరు టెర్రరిస్టులు కనిపిస్తుండటంతో తన వద్ద ఉన్న ఏకే–47తో ముందుకు పరిగెత్తుతూ కాల్పులు జరిపాడు. 30 రౌండ్ల మేగజైన్‌లోని 27 రౌండ్లు శత్రువుల శరీరాన్ని ఛిద్రం చేశాయి. ఈ కాల్పుల్లో ముస్కరుడు సాభిర్ అహ్‌మాలిక్ స్పాట్‌లోనే మృతి చెందాడు. మరో ఉగ్రవాదికి కూడా దొరబాబు కాల్చిన బులెట్లతో తీవ్ర గాయాలవ్వగా, ఇతర సైనికుల కాల్పుల్లో అతడుకూడా మరణించాడు.