AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విజయం

ఐపీఎల్‌లో నేటి తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. అబుదాబి వేదికగా సాగిన హైదరాబాద్ సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠ పోరు చివరి బంతి వరకు పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు టైగా మారింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో ఫెర్గ్యూసన్ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.

కోల్‌కతా నైట్ రైడర్స్ సూపర్ విజయం
Sanjay Kasula
|

Updated on: Oct 18, 2020 | 8:38 PM

Share

Kolkata Win Super Over : ఐపీఎల్‌లో నేటి తొలి మ్యాచ్ ఉత్కంఠభరితంగా ముగిసింది. అబుదాబి వేదికగా సాగిన హైదరాబాద్ సన్‌రైజర్స్, కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య ఉత్కంఠ పోరు చివరి బంతి వరకు పలు మలుపులు తిరిగి ఎట్టకేలకు టైగా మారింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారి తీసింది. ఈ సూపర్ ఓవర్‌లో ఫెర్గ్యూసన్ అద్భుత బౌలింగ్‌తో కోల్‌కతాకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. మ్యాచ్‌ పూర్తయ్యే సమయానికి హైదరాబాద్‌ 163/6తో నిలవడంతో స్కోర్లు సమమయ్యాయి. ఆపై హైదరాబాద్‌ సూపర్‌ ఓవర్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోవడంతో అనంతరం కోల్‌కతా సునాయాస విజయం సాధించింది.

ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన కోల్‌కతా 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేయగా, లక్ష్యఛేదనలో హైదరాబాద్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి అన్నే పరుగులు చేయడంతో మ్యాచ్ టైగా ముగిసింది. దీంతో మ్యాచ్ సూపర్ ఓవర్‌కు దారితీసింది.

ముందుగా 164 పరుగుల టార్గెట్‌ని ఛేదించే క్రమంలో హైదరాబాద్‌ 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 163 పరుగులే చేసింది. లక్ష్యఛేదనలో కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ 47 పరుగులు, అబ్దుల్‌ సమద్‌ 23 పరుగులతో రాణించినా ఫలితం లేకుండా పోయింది. ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (36), కేన్‌ విలియమ్సన్‌(29) మెరుపు ఓపెనింగ్‌ ఇచ్చారు. వీరిద్దరూ 6 ఓవర్లలో 57 పరుగులు జోడించి శుభారంభం చేశారు. మధ్యలో ప్రియమ్‌ గార్గ్‌(4), మనీష్‌ పాండే(6), విజయ్‌ శంకర్‌(7) నిరాశపర్చినా వార్నర్‌, సమద్‌ చివరి వరకూ పోరాడారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 164 పరుగులు చేసింది. చివర్లో కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌, దినేశ్‌ కార్తీక్‌ మెరుపు బ్యాటింగ్‌ చేయడంతో హైదరాబాద్‌ ముందు సాధారణ టార్గెట్‌ను మాత్రమే నిర్దేశించింది. తొలుత శుభ్‌మన్‌ గిల్‌, రాహుల్‌ త్రిపాఠి శుభారంభం చేయగా తొలి వికెట్‌కు 48 పరుగుల జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని నటరాజన్‌ ఆరో ఓవర్‌ చివరి బంతికి విడదీశాడు. త్రిపాఠిని బౌల్డ్‌ చేసి హైదరాబాద్‌కు తొలి బ్రేక్‌ ఇచ్చాడు.

ఆపై నితీశ్‌ రాణా(29)తో కలిసి శుభ్‌మన్‌గిల్‌ కోల్‌కతా ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా అది కుదరలేదు. 87 పరుగుల వద్ద గిల్‌, 88 పరుగుల వద్ద రాణా వెనువెంటనే ఇంటిదారి పట్టారు. ఆండ్రూ రసెల్‌(9) సైతం నిరాశను మిగిల్చాడు. దీంతో కోల్‌కతా 105 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయింది. చివర్లో ధాటిగా ఆడిన మోర్గాన్‌, కార్తీక్‌ జట్టు స్కోరును 160 దాటించారు. కాగా, చివరి బంతికి మోర్గాన్‌ ఔటయ్యాడు. హైదరాబాద్‌ బౌలర్లలో నటరాజన్‌ రెండు వికెట్లు తీయగా.. రషీద్‌ ఖాన్‌, విజయ్‌ శంకర్‌, బాసిల్‌ థంపి తలా ఒక వికెట్‌ పడగొట్టారు.