AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా?

స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెందిన నాలుగు టన్నుల భాగం చంద్రుడిని ఢీకొట్టింది. ఈ అరుదైన ఘటనలో సోడియం, లిథియం వాయువుల ఆనవాళ్లను శాస్త్రవేత్తలు గుర్తించారు. అందుకే సంబంధించిన వీడియోను తాజాగా ఎలాన్ మస్క్ షేర్ చేశారు. అలాగే ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Video: వామ్మో.. చిన్న రాకెట్ ముక్క చంద్రుడ్ని ఢీ కొంటే ఇంత భయంకరంగా ఉంటుందా?
Spacex Rocket Moon Impact
SN Pasha
|

Updated on: Aug 06, 2026 | 6:34 PM

Share

అంతరిక్ష పరిశోధనలో మరో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. స్పేస్‌ఎక్స్ ఫాల్కన్-9 రాకెట్‌కు చెందిన సుమారు నాలుగు టన్నుల బరువున్న రెండో దశ బుధవారం తెల్లవారుజామున చంద్రుడి పశ్చిమ అంచున ఉన్న ఐన్‌స్టీన్ బిలం సమీపంలో గంటకు సుమారు 5,400 మైళ్ల వేగంతో ఢీకొట్టింది. ఈ రాకెట్ భాగాన్ని 2025 జనవరిలో ఫైర్‌ఫ్లై ఏరోస్పేస్ రూపొందించిన లూనార్ ల్యాండర్‌ను అంతరిక్షంలోకి పంపేందుకు ఉపయోగించారు. ఈ ఢీకొనడం ముందుగా ప్రణాళిక వేసింది కాదని స్పేస్‌ఎక్స్ వెల్లడించింది.

ఈ ఘటనను భూమిపై ఉన్న టెలిస్కోపులు విజయవంతంగా పరిశీలించాయి. ముఖ్యంగా చిలీలోని యూరోపియన్ సదరన్ అబ్జర్వేటరీ (ESO)కు చెందిన వెరీ లార్జ్ టెలిస్కోప్, ఢీకొట్టిన వెంటనే చంద్రుడి ఉపరితలం నుంచి వెలువడిన స్వల్ప కాంతి, రసాయన సంకేతాలను గుర్తించింది. దీనికి సంబంధించిన వీడియోను స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే శాస్త్రవేత్తల ప్రకారం.. తాకిడి తర్వాత పైకి ఎగిసిన ధూళి మేఘంలో సోడియం, లిథియం వాయువుల ఆనవాళ్లు నమోదయ్యాయి. ఈ రసాయన సంకేతాలు ఐదు నుంచి పది నిమిషాల పాటు మాత్రమే కనిపించాయి.

వీడియో చూడండి

శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం.. గుర్తించిన సోడియం చంద్రుడి నేల నుంచే వచ్చిన అవకాశం ఉంది. అయితే లిథియం మాత్రం రాకెట్‌లోని బ్యాటరీలు లేదా ఇతర భాగాల నుంచి వచ్చి ఉండొచ్చని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ వివరాలపై మరింత లోతైన విశ్లేషణ కొనసాగుతోంది. సాధారణంగా ప్రయోగాలు పూర్తైన తర్వాత రాకెట్ దశలు భూమి వాతావరణంలోకి తిరిగి వచ్చి కాలిపోతాయి. కానీ చంద్రుడి దిశగా ప్రయాణించే మిషన్లలో ఉపయోగించే కొన్ని రాకెట్ భాగాలు అంతరిక్షంలోనే మిగిలిపోతుంటాయి. సూర్యుడి ప్రభావం, గురుత్వాకర్షణ శక్తుల కారణంగా ఈ రాకెట్ భాగం క్రమంగా తన కక్ష్యను మార్చుకుంటూ చివరకు చంద్రుడిని ఢీకొట్టిందని స్పేస్‌ఎక్స్ తెలిపింది.

మరిన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చంద్రుడిని రాకెట్ శకలం ఢీకొట్టిన వీడియో చూశారా?
చంద్రుడిని రాకెట్ శకలం ఢీకొట్టిన వీడియో చూశారా?
డబ్బు పోయినా పర్లేదు.. జీవితంలో ఈ కష్టాలు వస్తే మాత్రం భరించలేరట!
డబ్బు పోయినా పర్లేదు.. జీవితంలో ఈ కష్టాలు వస్తే మాత్రం భరించలేరట!
గంజి నీళ్లను పారబోస్తున్నారా?.. ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు!
గంజి నీళ్లను పారబోస్తున్నారా?.. ఇది తెలిస్తే ఇకపై అలా చేయరు!
మీరు సిజేరియన్ మదరా?..బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి!
మీరు సిజేరియన్ మదరా?..బ్రెస్ట్ ఫీడింగ్ విషయంలో ఈ తప్పులు చేయకండి!
ఫోన్ వాడిన తర్వాత మహిళల్లో ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త!
ఫోన్ వాడిన తర్వాత మహిళల్లో ఈ లక్షణాలుంటే తస్మాత్ జాగ్రత్త!
జాబ్ మార్కెట్‌లో నయా ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా Google
జాబ్ మార్కెట్‌లో నయా ట్రెండ్.. అత్యంత ఆకర్షణీయమైన కంపెనీగా Google
ఆధార్ కార్డులో మూడోసారి పేరు మార్చుకోవడం ఎలా..?
ఆధార్ కార్డులో మూడోసారి పేరు మార్చుకోవడం ఎలా..?
ఇన్‌స్టాగ్రామ్‌.. నేరాలకు కొత్త గేట్‌వే?
ఇన్‌స్టాగ్రామ్‌.. నేరాలకు కొత్త గేట్‌వే?
'వింక్' బ్యూటీకి వింత ప్రశ్న.. రిపోర్టర్‌పై నెటిజన్ల ఫైర్
'వింక్' బ్యూటీకి వింత ప్రశ్న.. రిపోర్టర్‌పై నెటిజన్ల ఫైర్
చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ..
చెడు కలలు వచ్చినప్పుడు ఏం చేయాలి? స్వప్నశాస్త్రం చెప్పే సులభ..