డబ్బు పోయింది.. తెచ్చివ్వండి: అసెంబ్లీలో రోధించిన ఎమ్మెల్యే

| Edited By: Srinu

Mar 07, 2019 | 7:33 PM

తన డబ్బు చోరికి గురైందంటూ సమాజ్‌వాది పార్టీ ఎమ్మల్యే కల్పనాథ్ పాశ్వన్ అసెంబ్లీలో రోధించారు. ఓ హోటల్ గదిలో ఆయన రూ.10లక్షలు దాచగా.. ఆదివారం రాత్రి హోటల్‌లో దొంగలు పడి ఆ డబ్బు దోచుకుపోయారట. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేయడంగానే అసెంబ్లీలో ప్రస్తావించారు కల్పనాథ్. ఆ పది లక్షలను తిరిగి ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కల్పనాథ్ కన్నీరు పెట్టుకున్నారు. ‘‘మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్లాలి..? నేను చాలా పేదవాడిని. ఆ డబ్బులు […]

డబ్బు పోయింది.. తెచ్చివ్వండి: అసెంబ్లీలో రోధించిన ఎమ్మెల్యే
Follow us on

తన డబ్బు చోరికి గురైందంటూ సమాజ్‌వాది పార్టీ ఎమ్మల్యే కల్పనాథ్ పాశ్వన్ అసెంబ్లీలో రోధించారు. ఓ హోటల్ గదిలో ఆయన రూ.10లక్షలు దాచగా.. ఆదివారం రాత్రి హోటల్‌లో దొంగలు పడి ఆ డబ్బు దోచుకుపోయారట. ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదుచేయడంగానే అసెంబ్లీలో ప్రస్తావించారు కల్పనాథ్. ఆ పది లక్షలను తిరిగి ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటూ కల్పనాథ్ కన్నీరు పెట్టుకున్నారు.

‘‘మీకు చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఇక్కడ న్యాయం జరగకపోతే ఎక్కడికి వెళ్లాలి..? నేను చాలా పేదవాడిని. ఆ డబ్బులు తిరిగి ఇప్పించకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ కల్పనాథ్’’ ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై మంత్రి సురేశ్ కుమార్ కన్నా స్పందిస్తూ.. న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. ఆయన ఒప్పుకుంటే ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తామని తెలిపారు. అయితే పేదవాడినని చెప్పుకొంటున్న కల్పనాథ్ అంత మొత్తాన్ని హోటల్ గదిలో ఎందుకు పెట్టారన్న విషయం చర్చనీయాంశంగా మారింది.