Breaking : గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత

|

Sep 25, 2020 | 1:47 PM

గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు.

Breaking : గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూత
Follow us on

గాన గంధర్వడు ఎస్పీ బాలసుబ్రమణ్యం కన్నుమూశారు. మధ్యాహ్నం 1 గంట 4 నిమిషాలకు ఆయన తుదిశ్వాస విడిచినట్టు తనయుడు ఎస్పీ చరణ్ తెలిపారు. అంత్యక్రియలపై కాసేపట్లో ప్రకటన చేస్తామని చరణ్ వివరించారు. గత నెల 5న కరోనాతో చెన్నై ఎంజీఎం ఆస్పత్రిలో చేరారు బాలు. కరోనా నుంచి కోలుకున్నా ఇతర ఆరోగ్య సమస్యలు ఆయన్ను చుట్టుముట్టాయి. ఆయన్ను కాపాడేందుకు డాక్టర్లు విశ్వప్రయత్నం చేశారు. వెంటిలేటర్ పై ఉంచి, ఎక్మో  ట్రీట్మెంట్ అందించారు. తొలుత ఆయన క్రమక్రమంగా కోలుకుంటున్నట్లే అనిపించినా, గురువారం అకస్మాత్తుగా ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. ఈ రోజు మధ్యాహ్నం ఆయన కోట్లాది మంది అభిమానులను ఒంటరి చేస్తూ దివికేగారు.

ఎస్పీ బాలు పూర్తిపేరు శ్రీపతి పండితారాధ్యుల బాల సుబ్రహ్మణ్యం. అభిమానులందరూ ఆయన్ను బాలుగా పిలుచుకుంటారు. పాటలు పాడటంతో పాటు కొన్ని సినిమాలకు ఆయన సంగీత దర్శకత్వం కూడా వహించారు. నటుడిగా, నిర్మాతగా కూడా సినిమాపై తన అభిరుచిని చాటుకున్నారు. బాలు చివరిసారిగా పలాస సినిమాకు పాటలు పాడారు. మొత్తంగా చూస్తే 16కుపైగా భాషల్లో 40,000కుపైగా పాటలు పాడి  గిన్నిస్ రికార్డును కూడా సొంతం చేసుకున్నారు ఎస్పీ బాలసుబ్రమణ్యం.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

తొలిసారి సారీ చెప్పిన కిమ్, అది కూడా శత్రు దేశానికి !