తొలిసారి సారీ చెప్పిన కిమ్, అది కూడా శత్రు దేశానికి !

ఓ సంచలనమే జరిగింది. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి సారీ చెప్పారు​. అది కూడా శత్రు దేశమైన దక్షిణ కొరియాకు. 

తొలిసారి సారీ చెప్పిన కిమ్, అది కూడా శత్రు దేశానికి !
Follow us

|

Updated on: Sep 25, 2020 | 1:22 PM

ఓ సంచలనమే జరిగింది. ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ మొదటిసారి సారీ చెప్పారు​. అది కూడా శత్రు దేశమైన దక్షిణ కొరియాకు.  తమ దేశ గవర్నమెంట్ ఆఫీసర్ హత్య అనుకోకుండా జరిగిందని కిమ్​ వివరణ ఇచ్చినట్లు దక్షిణ కొరియా అధ్యక్ష భవనం వెల్లడించింది.

ఏం జరిగిందంటే :

దక్షిణ కొరియాకు చెందిన ఒక ప్రభుత్వ అధికారిని ఉత్తర కొరియా కాల్చి చంపింది. ఆ తర్వాత మృతదేహాన్ని దహనం చేసింది. ఈ విషయాన్ని గురువారం దక్షిణ కొరియా తెలిపింది. అక్రమ చేపల వేట నిరోధక బృందంలో విధులు నిర్వర్తిస్తున్న ఆ 48 ఏళ్ల అధికారి సోమవారం ఓడ నుంచి మిస్సయ్యాడని.. మరుసటి రోజు ఓ చిన్నబోటులో ఉత్తర కొరియా జలాల్లోకి ప్రవేశించాడని, దీన్ని గమనించిన ఉత్తర కొరియా రక్షణ దళాలు అతణ్ని కాల్చి చంపారని పేర్కొంది.  పీపీఈ కిట్లు ధరించిన భద్రతా సిబ్బంది ఆ ఆఫీసర్ మృతదేహాన్ని దహనం చేశారని వెల్లడించింది. కరోనా వ్యాప్తి కట్టడి పేరుతో కఠిన నిబంధనలు అమలు చేస్తోంది ఉత్తర కొరియా. తమ దేశంలోకి అక్రమంగా ఫారెనర్స్ ఎవరైనా ప్రవేశిస్తే కాల్చి చంపేయాలని గతంలో ఆదేశాలు జారీ చేసింది.

Also Read :

‘పబ్​జీ’ ప్రేమాయణం, చివరకు !

ఒకే కాన్పులో నలుగురు పిల్లలకు జన్మనిచ్చిన కరోనా బాధితురాలు

తాలుకు కూడా అదిరే రేటు !