డేటింగ్‌పై స్పందించిన సోనాక్షి

దబాంగ్' సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్‌లోనే స్టార్ అయిపోయింది.

  • Pardhasaradhi Peri
  • Publish Date - 10:50 am, Mon, 25 May 20
డేటింగ్‌పై స్పందించిన సోనాక్షి

‘దబాంగ్’ సినిమాతో హిందీ సినిమా ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ సోనాక్షి సిన్హా. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ఓవర్ నైట్‌లోనే స్టార్ అయిపోయింది. ఆ తర్వాత కూడా కొన్ని రోజులు ఈమె ఉంటే సినిమా హిట్ అనే సెంటిమెంట్ పాకిపోయింది.

లాక్‌డౌన్‌తో సమయం లభించటంతో టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సోషల్ మీడియాలో బిజీగా ఉంటున్నారు. తమ అభిప్రాయాలను ఫ్యాన్స్‌తో పంచుకుంటున్నారు. ఈ సమయంలో షాహిద్‌, సోనాక్షి ప్రేమించుకుంటున్నారని వార్తలు గుప్పుమన్నాయి. అయితే తాజాగా తనపై వచ్చిన కొన్ని రూమర్స్‌పై స్పందించారు. తను, షాహిద్‌ కపూర్‌ ఇప్పటికీ మంచి స్నేహితులమని చెప్పుకొచ్చారు. కొందరు ఇలాంటి రూమర్స్‌ను సృష్టిస్తుంటారని అన్నారు. అయితే ఇలాంటివి తనను బాధించలేదని… వాటిని చూసి నవ్వుకునేవాళ్లమని సోనాక్షి అన్నారు.

‘ఆర్‌.. రాజ్‌కుమార్‌’ సినిమాలో సోనాక్షి సిన్హా, షాహిద్‌ కపూర్‌ కలిసి నటించారు. ప్రభుదేవా దర్శకత్వం వహించిన ఈ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అయితే ఆ కొద్దికాలానికే షాహిద్‌.. మీరా రాజ్‌పుత్‌ను వివాహం (2015) చేసుకున్నారు.