తండ్రిపై ప్రేమతో.. శవం ఎదుటే..!
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన ఆ జంట శవాన్ని పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకున్నారు. తిండివనం, వెల్లిపురానికి చెందిన దీవమణి-సెల్వీ దంపతుల కుమారుడు అలెగ్జాండర్. ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అలెగ్జాండర్‌కు సెప్టెంబర్ 2న జగదీశ్వరీ అనే అమ్మాయితో పెళ్లి ముహుర్తం ఖాయం అయింది. అనుకోకుండా తండ్రి హఠాన్మరణం చెందాడు. దీంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తన పెళ్లి చూడకుండానే తండ్రి మరణించాడని అలెగ్జాండర్ ఆవేదన చెందాడు. తండ్రి శవం […]
తమిళనాడులో విషాద ఘటన చోటుచేసుకుంది. సంతోషంగా పెళ్లి చేసుకోవాల్సిన ఆ జంట శవాన్ని పక్కన పెట్టుకుని పెళ్లి చేసుకున్నారు. తిండివనం, వెల్లిపురానికి చెందిన దీవమణి-సెల్వీ దంపతుల కుమారుడు అలెగ్జాండర్. ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. అలెగ్జాండర్‌కు సెప్టెంబర్ 2న జగదీశ్వరీ అనే అమ్మాయితో పెళ్లి ముహుర్తం ఖాయం అయింది. అనుకోకుండా తండ్రి హఠాన్మరణం చెందాడు. దీంతో కుటుంబం అంతా శోకసంద్రంలో మునిగిపోయింది. తన పెళ్లి చూడకుండానే తండ్రి మరణించాడని అలెగ్జాండర్ ఆవేదన చెందాడు. తండ్రి శవం ముందే తాళి కట్టాలని నిర్ణయించుకున్నాడు. కాబోయే భార్యతో చెప్పి.. వారి కుటుంబాన్ని ఒప్పించాడు. వారు అంగీకరించడంతో తండ్రి శవం ముందే పెళ్లి చేసుకున్నాడు.