నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం, మద్యానికి బానిసైన కొడుకు.. కన్న తల్లిని తలపై మోది కడతేర్చిన వైనం

మద్యానికి బానిసై కన్న తల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ సీఐ గాంధీ..

నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరం, మద్యానికి బానిసైన కొడుకు.. కన్న తల్లిని తలపై మోది కడతేర్చిన వైనం

మద్యానికి బానిసై కన్న తల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు. ఈ దారుణ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది. నాగర్ కర్నూల్ సీఐ గాంధీ నాయక్ తెలిపిన వివరాల ప్రకారం, నాగర్ కర్నూల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లి గ్రామానికి చెందిన శుభాకర్(20) కూలి పనులుచేస్తూ హైదరాబాదులో నివసించేవాడు. అయితే, లాక్ డౌన్ కారణంగా ఎలాంటి పనులు దొరకక తన సొంత గ్రామంలోనే గత కొన్ని రోజులుగా ఉంటున్నాడు. ఈ క్రమంలో అతను మద్యానికి బానిసై రోజూ తల్లితో గొడవ పడేవాడు. మద్యం సేవించేందుకు డబ్బు కోసం తల్లిని వేధించేవాడు. ఇవాళ తల్లి డబ్బులు లేవని చెప్పడంతో ఆగ్రహానికి గురైన శుభాకర్, శనివారం మధ్యాహ్నం మద్యం మత్తులో తల్లి ఇస్తారామ్మా (50) తలపై గట్టిగా కొట్టడంతో తల పగిలి ఆమె అక్కడే మృతి చెందింది. తల్లిని కొడుతుంటే అడ్డు వచ్చిన తన అక్కను సైతం బలంగా కొట్టి అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.