తల్లిని చంపిన తనయుడు, కారణం ఏంటంటే !

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది.  తల్లిని తనయుడే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ నెల 5న రాముడుపాలెం తండాలో భూక్యా సాలమ్మ బాయి (45) హత్యకు గురైంది.

తల్లిని చంపిన తనయుడు, కారణం ఏంటంటే !
Follow us

|

Updated on: Nov 10, 2020 | 7:13 PM

గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది.  తల్లిని తనయుడే అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ నెల 5న రాముడుపాలెం తండాలో భూక్యా సాలమ్మ బాయి (45) హత్యకు గురైంది. చిన్న కుమారుడు కొండానాయక్‌ గొడ్డలితో నరికి తల్లిని హతమార్చినట్లు గ్రామీణ సీఐ సుబ్బారావు సోమవారం తెలిపారు. సాలమ్మ భర్త నాన్యనాయక్‌ 9 ఏళ్ల క్రితం మృతి చెందాడు. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తెలు ఉన్నా కూడా వారి వద్ద ఉండటం లేదు. ఊరి చివరలో చిన్న ఇల్లు వేసుకొని నివాసం ఉండేది. తల్లి ప్రవర్తన సరిగా లేక పద్ధతి మార్చుకోవాలని కొడుకులు పలుమార్లు చెప్పినా ఆమె తీరు మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో వారి మధ్య పలుసార్లు గొడవలు కూడా అయ్యాయి. ఆమె వల్ల అందరి ముందు అవమానంగా జీవించాల్సి వస్తోందని చిన్న కుమారుడు కొండానాయక్‌ భావించి తల్లిని అంతం చేయాలని డిసైడయ్యాడు.

ఈ నెల 5న తల్లి వేరే వారితో ఫోన్‌లో మాట్లాడటం గమనించి కోపంతో మంచంలో ఉన్న తల్లిని గొడ్డలితో నరికి..ఆపై బ్లేడ్‌తో గొంతు కోసి హతమార్చాడు. ఆపై తనకేం తెలియనట్లు అమాయకంగా వ్యవహరించాడు.  హత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ చేస్తుండగా కొండానాయక్‌ ప్రవర్తనలో కాస్త తేడా కొట్టింది. అతడిని అదుపులోకి తీసుకుని తమ స్టైల్లో  విచారించగా తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు.

Also Read :

తెలంగాణ : పిడుగుపాటు బాధిత కుటుంబాలకు పరిహారం విడుదల

ఏపీలో కరోనా వ్యాక్సిన్‌ పంపిణీపై స్టీరింగ్‌ కమిటీ ఏర్పాటు

బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
బేకరీల్లో లభించే ఆనియన్ కచోరిని ఈజీగా ఇంట్లో తయారు చేసుకోవచ్చిలా!
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
ఇక్కడి చింతచెట్టు గింజలు ఎక్కడా మొలకెత్తవు ఈ ఆలయంలో అన్నీ వింతలే
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
మీ జనన ధృవీకరణ పత్రం పోయిందా..?  ఇలా దరఖాస్తు చేసుకోండి!
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
గుండె జబ్బులున్న వారు ఎక్కువ నీరు తాగకూడదా? నిపుణులు ఏమంటున్నారు?
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
పీతల కర్రీ చేయడం రాదా.. ఇదిగో ఈ రెసిపీ ఫాలో అయిపోండి!
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
ఎర్ర ఉల్లిగడ్డ, తెల్ల ఉల్లిగడ్డలో ఆరోగ్యానికి ఏది మంచిదో తెలుసా.?
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
నిశిధీలో అందాల రాకూమారి.. టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
మీక్కూడా తినగానే ఈ అలవాటు ఉందా.? దంతాలు డేంజర్‌లో పడ్డట్లే..
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఇంట్లో ఏ దిక్కులో ఏ ఫొటోలు పెట్టాలో తెలుసా.?
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..
ఈ సూపర్ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టగలరా ?..