ఏపీలో కరోనా వ్యాక్సిన్ పంపిణీపై స్టీరింగ్ కమిటీ ఏర్పాటు
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఏపీ సర్కార్ పూర్తి ప్రణాళికను రూపొందిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రెడీ చేయాల్సిన ప్లానింగ్ కోసం రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది.

కరోనా వైరస్ వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టినప్పటికీ సెకండ్ వేవ్ స్టార్టయ్యే పరిస్థితులు ఉన్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) హెచ్చరికలు జారీ చేసింది. ఈ తరుణంలో త్వరలోనే కరోనా వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందనే ఊహాగానాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ కరోనా వ్యాక్సిన్ పంపిణీకి సంబంధించిన విధివిధానాలు రూపొందించాలని అధికారులకు సూచించారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అలెర్టయ్యాయి.
కరోనా వ్యాక్సిన్ పంపిణీపై ఏపీ సర్కార్ పూర్తి ప్రణాళికను రూపొందిస్తోంది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చాక రెడీ చేయాల్సిన ప్లానింగ్ కోసం రాష్ట్రస్థాయి స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు గవర్నమెంట్ ఉత్తర్వులు జారీ చేసింది. 18మందితో స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో తెలిపింది. స్టీరింగ్ కమిటీ ఛైర్‌పర్సన్‌గా సీఎస్, కన్వీనర్‌గా ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి, మెంబర్స్‌గా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులనను నియమించారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ సన్నద్ధతపై చర్చించేందుకు స్టీరింగ్ కమిటీ నెలకు ఒకసారి మీటింగ్ నిర్వహించాలని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.
Also Read :