Breaking : ఏపీ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా సోము వీర్రాజు…
భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుని నియమించింది. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు విలేజ్ కు చెందిన సోమువీర్రాజు ప్రజంట్ బీజేపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆంధ్ర బీజపీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు […]

భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ సోము వీర్రాజుని నియమించింది. ఉత్తర్వులు వెంటనే అమల్లోకి వస్తాయని తెలిపింది. ఈ మేరకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సోమవారం ప్రకటన విడుదల చేశారు. తూర్పుగోదావరి జిల్లా కత్తేరు విలేజ్ కు చెందిన సోమువీర్రాజు ప్రజంట్ బీజేపీ ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. ఆంధ్ర బీజపీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు కన్నా లక్ష్మీనారాయణ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు 2018లో ఊహించని విధంగా పదవి దక్కింది. వైస్సార్సీలోకి చేరేందుకు కన్నా లక్ష్మీనారాయణ సిద్దమయిన సమయంలో పార్టీ అధ్యక్ష పదవిని కట్టబెట్టిందనే వార్తలు వైరల్ అయ్యాయి.
తాజాగా ఆరెస్సెస్‌తో దశాబ్దాలుగా ఉన్న అనుబంధం, బీజేపీలో మొదటి నుంచి కీలక నాయకుడిగా కొనసాగుతోన్న సోము వీర్రాజుకు పార్టీ అధ్యక్ష పదవి దక్కింది. సోము వీర్రాజుకు పదవి దక్కడంపై ఏపీ బీజేపీ నేతలు హర్తం వ్యక్తం చేస్తున్నారు.




