AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Smriti Mandhana: “ఈ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే”.. లేడీ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Smriti Mandhana: భారత మహిళల జట్టు వన్డే ప్రపంచకప్ గెలిచి ఏడాది పూర్తైన సందర్భంగా కొత్త కెప్టెన్ స్మృతి మంధాన భావోద్వేగంగా స్పందించింది. 2025 నవంబర్ 2న దక్షిణాఫ్రికాను ఓడించి భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్ టైటిల్‌ను ముద్దాడింది. ఆ విజయం తనకే కాకుండా దేశంలోని కోట్లాది మందికి ఎప్పటికీ ప్రత్యేకమైన జ్ఞాపకమని మంధాన చెప్పుకొచ్చింది.

Smriti Mandhana: ఈ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే.. లేడీ కోహ్లీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!
Smriti Mandhana
Venkata Chari
|

Updated on: Nov 02, 2026 | 12:21 PM

Share

Smriti Mandhana: హర్మన్‌ప్రీత్ కౌర్ స్థానంలో నెల రోజుల క్రితమే భారత మహిళల జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన స్మృతి మంధాన (Smriti Mandhana), ప్రపంచకప్ విజయం వార్షికోత్సవం సందర్భంగా పాత జ్ఞాపకాలను పంచుకుంది. “గత ఏడాది ఈ రోజు జట్టుకే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోట్లాది భారతీయులకు ఎప్పటికీ ప్రత్యేకమే. ఈ విజయం ప్రతి భారతీయుడిది, దేశానికి ప్రాతినిధ్యం వహించి గౌరవం తేవాలని కలలు కనే ప్రతి అమ్మాయిది” అని ఆమె పేర్కొంది.

మహిళల క్రికెట్‌లో వరల్డ్ కప్ కోసం భారత్ ఎదురుచూపులకు ఆ విజయంతో తెరపడింది. 2005, 2017లో రన్నరప్‌గా నిలిచిన జట్టు, సొంతగడ్డపై అభిమానుల సమక్షంలో తొలిసారి కప్ ముద్దాడింది. టోర్నీలో హర్మన్‌ప్రీత్ కౌర్ (Harmanpreet Kaur) సారథ్యం వహించగా, మంధాన బ్యాటింగ్‌లో కీలక పాత్ర పోషించింది.

వరల్డ్ కప్ ప్రయాణం ఇలా సాగింది..

గువాహటిలో శ్రీలంకపై డీఎల్ఎస్ పద్ధతిలో 59 పరుగుల తేడాతో గెలిచి భారత్ టోర్నీని ఘనంగా ఆరంభించింది. మంధాన, ప్రతీకా రావల్ (Pratika Rawal) శుభారంభం ఇవ్వగా, బౌలర్లు ప్రత్యర్థిని కట్టడి చేశారు. కొలంబోలో పాకిస్థాన్‌పై 88 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఎక్కువమంది చదివినది: ఒక్క మ్యాచ్‌లో హిట్.. 4 మ్యాచ్‌ల్లో ఫట్.. అవసరమంటవా గంభీర్.. ఏకిపారేస్తోన్న ఫ్యాన్స్..!

ఆ తర్వాత దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ చేతుల్లో వరుసగా మూడు ఓటములు ఎదురవడంతో సెమీస్ ఆశలు సంక్లిష్టమయ్యాయి. బంగ్లాదేశ్‌తో మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. దీంతో తర్వాతి మ్యాచ్ కీలకంగా మారింది. నవీ ముంబైలో న్యూజిలాండ్‌పై డీఎల్ఎస్ పద్ధతిలో 53 పరుగులతో గెలిచి, సెమీ ఫైనల్ బెర్త్ ఖాయం చేసుకుంది.

ఆసీస్‌పై చరిత్రాత్మక ఛేజింగ్..

డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన సెమీ ఫైనల్ భారత్ ప్రయాణంలో అతిపెద్ద క్షణాల్లో ఒకటి. 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించిన భారత్ 5 వికెట్ల తేడాతో గెలిచింది. జెమీమా రోడ్రిగ్స్ (Jemimah Rodrigues) 127 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ 89 పరుగులు చేసింది. వీరిద్దరి భాగస్వామ్యంతో మహిళల వరల్డ్ కప్ చరిత్రలోనే అతిపెద్ద విజయవంతమైన ఛేజింగ్‌లలో ఒకటిగా ఇది నిలిచింది.

ఫైనల్‌లో దక్షిణాఫ్రికాపై విజయం..

టైటిల్ పోరులో దక్షిణాఫ్రికాతో తలపడిన భారత్, మొదట బ్యాటింగ్ చేసి 298/7 స్కోరు చేసింది. షెఫాలీ వర్మ (Shafali Verma) 87, దీప్తి శర్మ (Deepti Sharma) 58 పరుగులు చేయగా, మంధాన 45 పరుగులతో ఓపెనింగ్‌లో రాణించింది.

ఎక్కువమంది చదివినది: ఐపీఎల్‌లో ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. ఆ తర్వాత టీమిండియాకు కెప్టెన్‌గా ప్రమోషన్ కొట్టేస్తాడు..!

దక్షిణాఫ్రికా తరఫున కెప్టెన్ లారా వోల్వార్ట్ (Laura Wolvaardt) 101 పరుగులతో పోరాడింది. కానీ భారత బౌలర్లు మ్యాచ్‌ను మలుపు తిప్పారు. దీప్తి 39 పరుగులిచ్చి 5 వికెట్లు తీయగా, షెఫాలీ 2 వికెట్లు పడగొట్టింది. సఫారీలు 246 పరుగులకే ఆలౌటయ్యారు. 52 పరుగుల తేడాతో గెలిచిన భారత్, తొలి మహిళల వన్డే ప్రపంచకప్ ట్రోఫీని సొంతం చేసుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
"ఈ రోజు ఎప్పటికీ ప్రత్యేకమే"..: స్మృతి మంధాన
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
చెట్టుపై ఆకులమధ్య అలజడి.. పరిశీలించి చూడగా వెన్నులో వణుకు!
మురాసు తుఫాన్‌ ఎఫెక్ట్‌పై అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
మురాసు తుఫాన్‌ ఎఫెక్ట్‌పై అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
బాణసంచా రహిత దీపావళిపై అవగాహన.. రంగంలోకి విరాట్‌ కోహ్లీ..
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
జాతివైరం మరిచిన మూగజీవాలు.. ఎంత స్నేహంగా ఉన్నాయో చూడండి
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
దీపావళికి స్వీట్లు కొంటున్నారా..? జాగ్రత్త, ఇప్పుడది తియ్యటి విషం
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
పుట్టగొడుగులు శాకాహారమా.. మాంసాహారమా? అసలు నిజాలు ఇవే!
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
ఉడికించిన గుడ్లా?వేయించిన గుడ్లా? వేటిలో అసలైన ప్రొటీన్ ఎక్కువ?
అప్పట్లో ట్రెండ్ సృష్టించిన హీరో.. కానీ పర్సనల్ లైఫ్ లో విషాదం..
అప్పట్లో ట్రెండ్ సృష్టించిన హీరో.. కానీ పర్సనల్ లైఫ్ లో విషాదం..
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..
ధన త్రయోదశి రోజున మీ రాశి ప్రకారం ఏ వస్తువులు కొంటే అదృష్టం..