AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై హాయి.. హాయిగా..!

చర్లపల్లి రైల్వేస్టేషన్‌కు వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్ న్యూస్. విమానాశ్రయం తరహాలో స్లీపింగ్ పాడ్స్ అందుబాటులోకి వచ్చేశాయి. అది కూడా తక్కువ ధరలలోనే.. మరి ఆ విషయాలు ఏంటో ఓ సారి ఈ స్టోరీలో చూసేద్దాం. వివరాలు ఇలా తెలుసుకోండి. అదేంటంటే.?

Hyderabad: చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్.. ఇకపై హాయి.. హాయిగా..!
Charlapalli Station
Ravi Kiran
|

Updated on: Dec 26, 2025 | 5:44 PM

Share

బస్సులు అటుంచితే.. దేశంలో చాలామంది ప్రయాణీకులు ఎక్కువగా తమ గమ్యస్థానాలను చేరుకునేందుకు రైళ్లను వినియోగిస్తుంటారు. ఇక ప్రయాణీకులకు కూడా మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు భారత రైల్వే ఎప్పటికప్పుడు సరికొత్తగా ముందుకు వస్తోంది. అందులో భాగంగానే అమృత్ భారత్ పథకం కింద దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లను అభివృద్ధి చేస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల విమానాశ్రయం తరహాలోనే రైల్వే స్టేషన్‌లోనూ స్లీపింగ్ పాడ్స్ తీసుకొచ్చింది. అది కూడా చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఇవి ప్రయాణీకులకు అందుబాటులో ఉండనున్నాయి. చర్లపల్లి రైల్వేస్టేషన్‌ను ప్రయాణీకులకు మరింత సౌకర్యవంతంగా మార్చేందుకు.. వారి అలసట తీర్చేందుకు తక్కువ ధరలో ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. గుంటూరు రైల్వేస్టేషన్‌లో కూడా ఈ సదుపాయం ఉండగా.. ఇప్పుడు చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో అలాంటి సౌకర్యం ప్రయాణీకులు వినియోగించుకోవచ్చు.

చర్లపల్లి రైల్వేస్టేషన్‌లో ఏర్పాటు చేసిన ఈ స్లీపింగ్ పాడ్స్‌లో మొత్తం 32 సింగిల్ బెడ్‌లు ఉన్నాయి. వీటిని సగం.. సగంగా పురుషులకు, మహిళలకు కేటాయించనున్నారు. ఈ స్లీపింగ్ పాడ్స్‌లో ఛార్జీలు ఇలా ఉండనున్నాయి.

2 గంటలకు: రూ. 200

6 గంటలకు: రూ. 400

12 గంటలకు: రూ. 800

24 గంటలకు (ఒకరోజు): రూ. 1200 చొప్పున ఛార్జీలుగా నిర్ణయించారు.

ఈ స్లీపింగ్ పాడ్స్ సౌకర్యంతో పాటు స్టేషన్‌లో ఫ్రీ వైఫై, స్నాక్స్ బార్, బెడ్లు, 24 గంటల పాటు హాట్ వాటర్, లగేజీని భద్రపరుచుకోవడానికి లాకర్ లాంటి సౌకర్యాలను కూడా వినియోగించుకోవచ్చు. ఇన్ని సదుపాయాలను ప్రయాణీకులు సద్వినియోగం చేసుకోవాలని రైల్వేశాఖ తెలిపింది. ఈ తరహ సదుపాయం మొదట ముంబై రైల్వేస్టేషన్‌లో ప్రారంభించగా.. దానికి మంచి ఆదరణ లభించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
చర్లపల్లి వెళ్లే ప్రయాణీకులకు సూపర్ గుడ్‌న్యూస్..
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
ఐఏఎస్ ఆఫీసర్ జీతం ఎంత.. పవర్, ప్రయోజనాల గురించి తెలుసా..?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
భారతదేశంలో అత్యంత ధనవంతులు ఎవరు? ఎవరి సంపద ఎక్కువగా పెరిగింది?
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
రైలులో రెచ్చిపోయిన కానిస్టేబుల్‌..విద్యార్ధినితో అసభ్యంగా వీడియో
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
ఆటోగ్రాఫ్ అడిగితే ఫోన్ నంబర్.. లెక్కల మాస్టారి లవ్ స్టోరి
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
బంగ్లాదేశ్‌లో ఇద్దరు హిందువుల హత్య.. భారత్‌ మాస్ వార్నింగ్‌!
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
ఎనిమిది మంది ప్రాణాలు కాపాడిన బాలుడు.. వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
బిర్యానీ ఆర్డర్ల మోత.. నిమిషానికి 200 ఆర్డర్లు వీడియో
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ఎందుకు విక్రమ్ ఇలా చేశావ్.. బెట్టింగ్‌కు అలవాటు పడి..
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?
ప్రపంచంలో న్యూ ఇయర్ వేడుకలు ఫస్ట్ ఎక్కడ జరుగుతాయో తెలుసా..?