రాత్రుళ్లు ఆలస్యంగా నిద్రపోతున్నారా.? మీ రొమాంటిక్ లైఫ్‌కు డేంజరేనట.. బయటపడిన షాకింగ్ నిజాలు..
మీరు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే.? లేట్‌గా నిద్ర లేస్తున్నారా.? అయితే తస్మాత్ జాగ్రత్త.! అది మీ ప్రేమ, లైంగిక జీవితాలపై తీవ్రమైన ప్రభావం..

Sleep Affects On Love and Sex Life: మీరు రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయి.? లేట్‌గా మేల్కొంటున్నారా.? అయితే తస్మాత్ జాగ్రత్త.! అది మీ ప్రేమ, లైంగిక జీవితాలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. తాజాగా యూనివర్సిటీ ఆఫ్ చికాగో పరిశోధకులు చేసిన ఓ అధ్యయనంలో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మనం నిద్రపోయే విధానాలు, స్లీపింగ్ ప్యాట్రన్స్.. ప్రేమ, లైంగిక జీవితాలపై ఎఫెక్ట్ చూపిస్తాయని తేలింది.
అధ్యయనం ప్రకారం, రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోయే వాళ్ల రిలేషన్‌షిప్ ఎక్కువ కాలం ఉండదని తేలింది. అలాంటి వ్యక్తులు తమ రిలేషన్‌ను సీరియస్‌గా తీసుకోరని అధ్యయనంలో వెల్లడైంది. మరోవైపు ఆలస్యంగా నిద్రపోయి.. ఆలస్యంగా మేల్కొనేవారికి ఎక్కువగా శారీరక సంబంధాలు ఉంటాయని.. వాటిని చేసుకోవడంలో దూకుడుతత్వాన్ని ప్రదర్శిస్తారని పేర్కొంది. అలాంటి వ్యక్తులు రోజుకు 2-3 సార్లు శారీరక సంబంధాలు పెట్టుకుంటారని తెలిపింది. ఇక రాత్రి పూట తొందరగా నిద్రపోయి.. ఉదయాన్నే మేల్కొనేవారు తమ రిలేషన్‌పై బలంగా ఉంటారని.. వారి జీవిత భాగస్వామికి సంబంధించిన చిన్న విషయాన్ని సైతం పట్టించుకుంటారని తెలిపింది. అలాంటి వ్యక్తుల రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందని స్పష్టమైంది.
Also Read: రైల్వే ప్రయాణీకులకు ముఖ్య గమనిక.. పలు స్పెషల్ ట్రైన్స్ సమయాల్లో మార్పు.. కీలక సమాచారం ఇదే..
