‘‘చెంప దెబ్బల’’ ఆట.. ఎప్పుడైనా విన్నారా..!
చెంప దెబ్బల ఆట.. వినడానికి, చదవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. నిజంగా ఇలాంటి ఓ ఆట ఉందండోయ్. దీనికి ఒక ఛాంపియన్ షిప్ కూడా ఉంది. అంతేకాదు అన్నీ ఆటల్లాగే ఇందులో రూల్సూ ఉంటాయి.. గెలిస్తే బహుమతులూ ఉంటాయి. రష్యాలోని క్రాస్నోయార్క్ పట్టణంలో నిర్వహించే ఈ వింత పోటీలలో మూడంటే మూడు చెంపదెబ్బలు ఉంటాయి. ప్రత్యేకించి వారాంతాల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతోంది. ఇక ఈ టోర్నీ ఎలా కొనసాగుతుందంటే.. వేదిక మీద ఓ […]
చెంప దెబ్బల ఆట.. వినడానికి, చదవడానికి కాస్త విచిత్రంగా ఉన్నా.. నిజంగా ఇలాంటి ఓ ఆట ఉందండోయ్. దీనికి ఒక ఛాంపియన్ షిప్ కూడా ఉంది. అంతేకాదు అన్నీ ఆటల్లాగే ఇందులో రూల్సూ ఉంటాయి.. గెలిస్తే బహుమతులూ ఉంటాయి. రష్యాలోని క్రాస్నోయార్క్ పట్టణంలో నిర్వహించే ఈ వింత పోటీలలో మూడంటే మూడు చెంపదెబ్బలు ఉంటాయి. ప్రత్యేకించి వారాంతాల్లో రెండు రోజుల పాటు ఈ టోర్నీ కొనసాగుతోంది.
ఇక ఈ టోర్నీ ఎలా కొనసాగుతుందంటే.. వేదిక మీద ఓ టేబుల్ ఉంటుంది. దానికి చెరో పక్క ఇద్దరు పోటీదారులు నిల్చుంటారు. ఈ పోటీదారులిద్దరూ పరస్పరం ఒకరి చెంపను ఒకరు పగలగొట్టాల్సి ఉంటుంది. ఎంత గట్టిగా కొట్టగలిగితే అంతగా టైటిల్‌కు చేరువవుతారు. ఈ ఆటకు అక్కడ మంచి డిమాండ్ ఉండగా.. టోర్నమెంట్‌లో పాల్గొని, తమ బలాన్ని నిరూపించుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో పోటీదారులు వస్తుంటారు. వారిలో చాలామంది సోషల్ మీడియాలో సెలబ్రిటీలుగా కూడా మారిపోతున్నారు. ఈ ఏడాది ఈ ఛాంపియన్ షిప్‌లో విజేతగా నిలిచిన 28ఏళ్ల వాసిలీ కామోట్క్సీ అనే వ్యక్తి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కాగా ఈ ఆటలో గెలిచినా, ఓడినా పోటీలో పాల్గొన్న అందరి గాయాలకీ ఉచితంగానే వైద్యం అందిస్తారట.