అదే ఆసుపత్రిలో మరో దారుణం.. వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు

| Edited By:

Jun 22, 2019 | 4:04 PM

ఇప్పటికే మెదడువాపు వ్యాధి ద్వారా పసిపిల్లల మరణాలతో(శనివారానికి 108మంది పిల్లల మృతి) వార్తలకెక్కిన బీహార్‌ ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు సంబంధించిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ ఆసుపత్రి సమీపంలో వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్నింటిని కాల్చివేసినట్లు, మరికొన్నింటిని సగం పూడ్చినట్లు, ఇంకొన్నింటిని బస్తాలలో కుక్కినట్లుగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఆసుపత్రికి చెందిన పోస్ట్‌మార్టం విభాగం నిర్వాకమని.. పోస్ట్‌మార్టం తరువాత మృతదేహాలను బహిరంగంగా పారేశారని విమర్శలు […]

అదే ఆసుపత్రిలో మరో దారుణం.. వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు
Follow us on

ఇప్పటికే మెదడువాపు వ్యాధి ద్వారా పసిపిల్లల మరణాలతో(శనివారానికి 108మంది పిల్లల మృతి) వార్తలకెక్కిన బీహార్‌ ముజఫర్‌పూర్‌లోని శ్రీ కృష్ణ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌కు సంబంధించిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోన్న ఈ ఆసుపత్రి సమీపంలో వందలాది పుర్రెలు, అస్థిపంజరాలు దర్శనమిస్తున్నాయి. వాటిలో కొన్నింటిని కాల్చివేసినట్లు, మరికొన్నింటిని సగం పూడ్చినట్లు, ఇంకొన్నింటిని బస్తాలలో కుక్కినట్లుగా కనిపిస్తున్నాయి. ఇదంతా ఆసుపత్రికి చెందిన పోస్ట్‌మార్టం విభాగం నిర్వాకమని.. పోస్ట్‌మార్టం తరువాత మృతదేహాలను బహిరంగంగా పారేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇక దీనిపై స్పందించిన ఆసుపత్రి సూపరిటెండెంట్ ఎస్‌కే షాహి సమగ్ర దర్యాప్తుకు ఆదేశాలిచ్చారు. దీంతో పోలీసులతో కలిసి ఎస్‌కెఎంసిహెచ్ ఆసుపత్రి దర్యాప్తు బృందం శనివారం సంఘటనా స్థలాన్ని సందర్శించింది. మరోవైపు దీనిపై ఆసుపత్రికి చెందిన డాక్టర్ విపిన్ కుమార్ మాట్లాడుతూ.. అస్థిపంజర అవశేషాలను కనుగొన్నమాట వాస్తవమేనని.. దాని గురించి అన్ని వివరాలను రాబట్టనున్నామని చెప్పారు.