విషాదాంతంగా 16 రోజుల పసికందు మిస్సింగ్ కేసు.. సొంత వాళ్ల పనేనా..!
తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో పదహారు రోజుల పసికందు మిస్సింగ్ విషాదాంతమైంది.

తూర్పు గోదావరి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. సీతానగరం మండలం చిన్న కొండేపూడిలో పదహారు రోజుల పసికందు మిస్సింగ్ విషాదాంతమైంది. దగ్గర్లోని ఓ బావిలో పసిపాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. కాళ్ల సతీష్, సుజనా దంపతులకు 16 రోజుల క్రితం పాప జన్మించింది. గురువారం రాత్రి పాప, సుజనా పక్కన నిద్రిస్తుండగా దుండగులు ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున లేచి చూసేసరికి పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ క్రమంలో సమీప బావిలో పసిపాప మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఇది సొంత వాళ్ల పనేనని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో మరిన్ని విషయాలు వెల్లడిస్తామని పోలీసులు చెబుతున్నారు.
Read This Story Also: డిగ్రీ పూర్తి చేసుకున్నా.. నెక్ట్స్ ఏంటో..!
