రైల్వేల్లో.. అందుబాటులోకి.. కొత్త సర్వీసులు..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేల్లో సరికొత్త సేవలు అందుబాటులోకి

  • Tv9 Telugu
  • Publish Date - 7:46 pm, Fri, 19 June 20
రైల్వేల్లో.. అందుబాటులోకి.. కొత్త సర్వీసులు..

ఓవైపు కోవిద్-19 విజృంభిస్తోంది. మరోవైపు గాల్వన్ లోయలో ఇండో-చైనా బోర్డర్ లో ఉద్రిక్తతలు చోటుచేసుకుంటున్నాయి. ఈ క్రమంలో రైల్వేల్లో సరికొత్త సేవలు అందుబాటులోకి వస్తున్నాయి. దక్షిణ మధ్య రైల్వేలో కొద్ది రోజుల క్రితమే ప్రారంభమైన ‘కాంటాక్ట్‌లెస్ బోర్డింగ్ పాస్ అండ్ టికెట్ చెకింగ్ సిస్టమ్‌’ను తాజాగా నార్త్ సెంట్రల్ రైల్వేలొ కూడా ప్రారంభించారు. ప్రయాగ్‌రాజ్ జంక్షన్‌లో తొలిగా ఈ సేవలు శుక్రవారం అందుబాటులోకి వచ్చాయి.

కోవిడ్ 19 నేపథ్యంలో వైరస్ ఎక్కువ మందికి వ్యాపించకుండా ఉండేందుకు రైల్వేలు ఈ విధానాన్ని అమల్లోకి తెచ్చాయి. విమానాశ్రయాల్లో మాదిరిగా ఉండే బోర్డింగ్ ఫెసిలిటీని ప్రయాణికులకు రైల్వేల్లో అందుబాటులోకి వచ్చినట్లైంది. ఈ విధానంలో భాగంగా.. ప్రయాగ్‌రాజ్ స్టేషన్ బోర్డింగ్ హాల్‌లో నాలుగు కాంటాక్ట్‌లెస్ చెకిన్ కౌంటర్లు ఏర్పాటయ్యాయి. రెండువైపులా కనిపించే టీఎఫ్‌టీ మానిటర్లను ఇన్‌స్టాల్ చేశారు. ఒకవైపు ప్యాసింజర్లకు, మరోవైపు చెకింగ్ స్టాప్‌కు. టికెట్లను స్కాన్ చేయడం కోసం ప్యాసింజర్ల వైపు వెబ్‌క్యామ్ పెట్టారు.

రైల్వే స్టాఫ్ ప్యాసింజర్ పీఎన్ఆర్‌ను వెబ్‌క్యామ్ ద్వారా లేదా క్యూఆర్ కోడ్ స్కానింగ్ ద్వారా తనిఖీ చేస్తారు. ప్యాసింజర్లు, స్టాఫ్‌కు ఇరువైపుల స్పీకర్లుంటాయి. వీటి ద్వారా మాట్లాడుకోవచ్చు. టికెట్ చెకింగ్ ద్వారా ప్యాసింజర్ ఐడెంటిఫికేషన్ పూర్తయిన తర్వాత ప్యాసింజర్ వైపున ఉన్న ప్రింటర్ ద్వారా బోర్డింగ్ పాస్‌ను ప్రింట్ చేస్తారు. ఇందులో ప్యాసింజర్ పేరు, పీఎన్ఆర్ నెంబర్, కోచ్ నెంబర్, బెర్త్ నెంబర్ వంటి వివరాలుంటాయి.