Singer Sunitha: వివాహం తర్వాత తొలిసారి పోస్ట్ చేసిన సునీత… కాఫీ తాగుతోన్న సమయంలో..
Singer Sunitha Instagram Post: ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితం జీవితం తర్వాత ప్రముఖ గాయని సునీత ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేనినితో సునీత తన జీవితాన్ని మరోసారి కొత్తగా..
Singer Sunitha Instagram Post: ఎన్నో ఏళ్ల ఒంటరి జీవితం తర్వాత ప్రముఖ గాయని సునీత ఇటీవల వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. వ్యాపారవేత్త రామ్ వీరపనేనితో సునీత తన జీవితాన్ని మరోసారి కొత్తగా ప్రారంభించారు. శంషాబాద్‌లోని ఒక దేవాలయంలో జరిగిన ఈ వివాహ వేడుకకు చిత్ర సీమతో పాటు ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో తెగ వైరల్‌గా మారాయి. సోషల్ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా ఉండని సునీత వివాహం తర్వాత నుంచి క్రీయాశీలకంగా మారింది. తన వివాహ వేడుకకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేస్తుందీ సూపర్ సింగర్. ఈ క్రమంలోనే తాజాగా సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఓ ఫొటో ఆమె అభిమానులను ఆకట్టుకుంటోంది. సోఫాలో కూర్చొని వేడి వేడి కాఫీ తాగుతోన్న సమయంలో దిగిన ఓ ఫొటోను షేర్ చేసిన సునీత.. ‘హ్యాపీ కాఫీ టైమ్’ అనే క్యాప్షన్ జోడించింది. వివాహం తర్వాత సునీత పోస్ట్ చేసిన తొలి ఫొటో ఇదే కావడం విశేషం.
సునీత ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన ఫొటో…
View this post on Instagram
Also Read: Kgf chapter 2 climax : కేజీఎఫ్ క్లైమాక్స్ కోసం ఎంత ఖర్చు పెట్టారో తెలిస్తే షాక్ అవుతారు..