అక్కడ పిల్లల్ని కంటే డబ్బులిస్తారు!
సింగపూర్ ప్రభుత్వం వివాహిత జంటలకు బ్రహ్మండమైన ఆఫర్ ఇచ్చింది.. పిల్లల్ని కంటే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.. ఇందుకు కారణమేమిటంటే కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు తగ్గుతూ రావడం.. కరోనా కష్టకాలంలో ఈ రేటు ఇంకా తగ్గింది.. పిల్లలను కనాలనుకునే భార్యభర్తలు కూడా ఈ సంక్షోభ సమయంలో ఎందుకులేనని అనుకుంటున్నారట! ఒక్క సింగపూరే కాదు.. అంతటా ఇదే పరిస్థితి అనుకోండి.. కాకపోతే సింగపూర్‌లో కాస్త ఎక్కువ! ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేటు ఉన్న దేశం సింగపూరేనట! ఈ […]
సింగపూర్ ప్రభుత్వం వివాహిత జంటలకు బ్రహ్మండమైన ఆఫర్ ఇచ్చింది.. పిల్లల్ని కంటే నగదు బహుమతి ఇస్తామని ప్రకటించింది.. ఇందుకు కారణమేమిటంటే కొన్నేళ్లుగా అక్కడ జననాల రేటు తగ్గుతూ రావడం.. కరోనా కష్టకాలంలో ఈ రేటు ఇంకా తగ్గింది.. పిల్లలను కనాలనుకునే భార్యభర్తలు కూడా ఈ సంక్షోభ సమయంలో ఎందుకులేనని అనుకుంటున్నారట! ఒక్క సింగపూరే కాదు.. అంతటా ఇదే పరిస్థితి అనుకోండి.. కాకపోతే సింగపూర్‌లో కాస్త ఎక్కువ! ప్రపంచంలోనే అత్యల్ప జననాల రేటు ఉన్న దేశం సింగపూరేనట! ఈ సమస్య నుంచి బయటపడటానికే అక్కడి ప్రభుత్వం ఇంతకు ముందే బేబీ బోనస్ క్యాష్ గిఫ్ట్ స్కీమ్‌ను తెచ్చింది.. పిల్లలను కన్న వివాహిత జంటలకు పది వేల సింగపూర్ డాలర్లు బహుమతిగా ఇస్తారు.. అయితే కరోనా వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత జననాల రేటు మరింత తగ్గింది.. కరోనా భయంతోనే పిల్లలను కనడాన్ని వాయిదా వేసుకుంటున్నారు.. అందుకే ప్రభుత్వం ది బేబీ సపోర్ట్ గ్రాంట్ పేరుతో మరో స్కీమ్‌ను ప్రవేశపెట్టింది. అక్టోబరు ఒకటి నుంచి 2022 సెప్టెంబర్ 30 మధ్య కాలంలో పిల్లలను కనేవారికి మూడు వేల సింగపూర్ డాలర్లను కానుకగా ఇస్తారు. సింగపూర్‌లో ఇలా ఉంటే ఆ దేశం పక్కనే ఉన్న ఇండోనేషియా, ఫిలిప్పీన్స్‌లో మాత్రం ఇందుకు పూర్తి రివర్స్.. అక్కడే జననాల రేటు ఎక్కువ.. పెరుగుతున్న జనాభాను ఎలా నియంత్రించాలా అని ఆ దేశాలు తలలు పట్టుకుంటున్నాయి..