AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

10 జట్లు ఓవైపు.. వీడోక్కడే మరోవైపు.. ఐపీఎల్‌లో ఇంత డేంజరస్ బ్యాటర్ అనుకోలే

Shreyas Iyer Praise Vaibhav Suravanshi: ఐపీఎల్ 2026లో 10 జట్లు ట్రోపీ కోసం పోరాడుతున్నాయి. అయితే, కొన్ని జట్లు ఆకట్టుకోవడంలో విఫలమవుతున్నాయి. ఈ క్రమంలో పంజాబ్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఓ యంగ్ ప్లేయర్‌ను పొగడ్తలతో ముంచెత్తాడు. ఇలాంటోడిని ఇంతకుముందు చూడలేదంటూ చెప్పుకొచ్చాడు.

10 జట్లు ఓవైపు.. వీడోక్కడే మరోవైపు.. ఐపీఎల్‌లో ఇంత డేంజరస్ బ్యాటర్ అనుకోలే
Shreyas Iyer Praise Vaibhav SuravanshiImage Credit source: https://x.com/PunjabKingsIPL
Venkata Chari
|

Updated on: Apr 21, 2026 | 4:48 PM

Share

Shreyas Iyer Praise Vaibhav Suravanshi: ఐపీఎల్ 2026 జోరుగా దూసుకెళ్తోంది. భారత క్రికెట్ దిగ్గజం, పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయస్ అయ్యర్ ఆధ్వర్యంలోని జట్టు పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచి ప్లే ఆఫ్స్ దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో శ్రేయాస్ అయ్యర్ ఒక యువ ఆటగాడి అసాధారణ ప్రతిభను కొనియాడడం సంచలనంగా మారింది. తాజాగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో జరిగిన పోరు అనంతరం ఈ కీలక వ్యాఖ్యలు చేశాడు. రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ యువ ఓపెనర్ బ్యాటింగ్ శైలి, క్రీజులో అతని వేగం తనను ఆశ్చర్యపరిచాయని, అతను భవిష్యత్తులో భారత జట్టుకు వెన్నెముకగా మారుతాడని అయ్యర్ ధీమా వ్యక్తం చేయడం గమనార్హం.

రాజస్థాన్ ఆణిముత్యం.. వైభవ్ సూరవంశీ వీరవిహారం..

ఈ సీజన్ ఐపీఎల్‌లో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న పేరు వైభవ్ సూరవంశీ. కేవలం 6 ఇన్నింగ్స్‌లలోనే 41 సగటుతో, ఏకంగా 236.53 స్ట్రైక్ రేట్‌తో 246 పరుగులు సాధించి విధ్వంసకర బ్యాటర్‌గా ముద్ర వేసుకున్నాడు.

ఇది కూడా చదవండి: IPL 2026: ‘లైఫ్ లైన్’ ఇచ్చిన మ్యాజిక్.. కేకేఆర్ ప్లేఆఫ్ చేరాలంటే ఇలా జరగాల్సిందేనయ్యో..!

అతని ఆటతీరును చూస్తుంటే ఒక అనుభవజ్ఞుడైన ఆటగాడు ఆడుతున్నట్లుగా ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. బంతిని ఎదుర్కోవడంలో అతను చూపే రిథమ్, మోమెంటం నిజంగా అద్భుతమని అయ్యర్ పేర్కొన్నాడు.

భవిష్యత్తు తారగా వైభవ్..

శ్రేయస్ అయ్యర్ వైభవ్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “వైభవ్ ఒక అరుదైన ప్రతిభ. బంతి బ్యాట్‌కు తగలకముందే అతను సృష్టించుకునే రిథమ్ నన్ను కట్టిపడేసింది. అతను ఖచ్చితంగా భవిష్యత్తులో గొప్ప స్థాయికి చేరుకుంటాడు” అని ప్రశంసించాడు.

మైదానంలో అతని ఆత్మవిశ్వాసం, బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టే విధానం జట్టుకు గొప్ప బలాన్ని ఇస్తున్నాయని అయ్యర్ అభిప్రాయపడ్డాడు.

అయ్యర్ విజయయాత్ర.. పంజాబ్ అగ్రస్థానం..

శ్రేయస్ అయ్యర్ ఈ సీజన్‌లో భీకరమైన ఫామ్‌లో ఉన్నాడు. 6 ఇన్నింగ్స్‌లలో 52 సగటుతో 208 పరుగులు సాధించి తన జట్టును పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిపాడు. గతేడాది పంజాబ్ కింగ్స్‌ను రన్నరప్‌గా నిలిపిన అయ్యర్, ఈసారి ఎలాగైనా కప్పు సాధించాలనే పట్టుదలతో ఉన్నాడు. ప్రపంచ స్థాయి బౌలర్ జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్‌లో తాను ఆడిన ఒక ప్రత్యేక షాట్‌ను గుర్తు చేసుకుంటూ, అత్యుత్తమ బౌలర్లను ఎదుర్కొనేటప్పుడు నైపుణ్యాన్ని నమ్మడమే కీలకమని వివరించాడు.

మానసిక దృక్పథమే విజేతను నిర్ణయిస్తుంది..

మైదానంలో తన భావోద్వేగాలను అదుపులో ఉంచుకోవడంపై అయ్యర్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. భారీ షాట్లు ఆడినప్పుడు లేదా వికెట్ తీసినప్పుడు సంబరాలు చేసుకోకపోవడానికి కారణం, లక్ష్యంపై స్పష్టత కోల్పోకూడదనే ఉద్దేశమేనని చెప్పాడు.

ఇది కూడా చదవండి: Virat Kohli: క్రికెట్ హిస్టరీలోనే సరికొత్త చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. అరుదైన ప్రపంచ రికార్డ్ భయ్యో..!

బ్యాటర్ గానే కాకుండా కెప్టెన్ గా కూడా జట్టును అజేయంగా ముందుకు నడిపిస్తూ అయ్యర్ తనదైన ముద్ర వేస్తున్నాడు. యువ ఆటగాళ్లను ప్రోత్సహిస్తూ జట్టులో స్ఫూర్తిని నింపుతున్న తీరు అభినందనీయం.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us