AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!

తెలంగాణలో నేటి అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుంది. బస్సులు నిలిచిపోనున్నాయని సమాచారం. ఆర్టీసీ జేఏసీ నేతలు తమ డిమాండ్లపై సమ్మెకు దిగుతున్నారు. ప్రభుత్వంతో ఇప్పటికే చర్చలు జరపగా.. అవి విఫలమయ్యాయి. దీంతో సమ్మె బాట పట్టడం తప్పడం లేదని చెబుతున్నారు.

TGSRTC: ఆర్టీసీ ప్రయాణికులకు షాకింగ్ న్యూస్.. అర్థరాత్రి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బస్సులు బంద్..!
Tgsrtc
Venkatrao Lella
|

Updated on: Apr 21, 2026 | 4:26 PM

Share

తెలంగాణలో టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు బంద్ కానున్నాయి. ఆర్టీసీ జేఏసీ నేతలు ఏప్రిల్ 21వ తేదీ అర్థరాత్రి నుంచి సమ్మెకు దిగుతున్నట్లు ప్రకటించారు. దీంతో నేటి అర్థరాత్రి నుంచే బస్సులు నిలిచిపోతున్నాయని తెలుస్తోంది. ఏప్రిల్ 22 ఉదయం షిప్ట్ నుంచే కార్మికులు సమ్మె బాట పట్టనున్నారు. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా బస్సులు ఆపేయనున్నారని తెలుస్తోంది. బస్సు సర్వీసులు నిలిచిపోతే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశముంది. ఆర్టీసీ సేవలకు అంతరాయం కలగనుండటంతో ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలకు చేపట్టేందుకు సిద్దమవుతోంది. టీజీఎస్‌ఆర్టీసీ బస్సులు ఆగిపోతే రాష్ట్రవ్యాప్తంగా ప్రజా రవాణా వ్యవస్థ స్తంభించే అవకాశముంది. దీని వల్ల రాష్ట్రవ్యాప్తంగా ప్రయాణికుల రాకపోకలకు అంతరాయం కలగనుంది. దీంతో సమ్మెను విరమింపచేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా.. ఆర్టీసీ జేఏసీ నేతలు వెనక్కి తగ్గడం లేదు.

సమ్మె తప్పడం లేదు

రాష్ట్రంలో దాదాపు 60 లక్షల మంది ప్రజలు రోజూ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తున్నారు. ఇక మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ద్వారా 35 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారు. దీంతో కార్మికులు సమ్మెకు దిగితే మహిళలతో పాటు ఆర్టీసీ ప్రయాణికులు ఇబ్బందులు పడే అవకాశముంది. దాదాపు 10 వేల బస్సులను డిపోల్లోనే నిలిపివేసి కార్మికులు విధులను బహిష్కరించనున్నారు. దీంతో ప్రభుత్వం బస్సులు నిలిచిపోకుండా చర్యలు చేపట్టాలని, కార్మికుల డిమాండ్లను నెరవేర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. అయితే జేఏసీ నేతలతో రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఆర్డీసీ ఎండీ చర్చలు జరిపారు. అయితే చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మె తప్పడం లేదని తెలంగాణ జాతీయ మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హనుమంతు ముదిరాజ్ స్పష్టం చేశారు. బుధవారం ఉదయం నుంచే బస్సులను నిలిపివేస్తామని ప్రకటించారు.

బస్సులు ఆగనివ్వం

అయితే ఆర్టీసీ జేఏసీ సమ్మెపై రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. బస్సులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగనివ్వబోమని ప్రకటించారు. ఆర్టీసీ అనేది పేద ప్రజల లైఫ్‌లైన్ అని, బస్సుల ఆగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. కార్మికుల డిమాండ్లను నెరవేర్చేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, కార్మికలు మెజార్టీ డిమాండ్లను నెరవేర్చుతామని తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెన్నై పర్యటన నుంచి వచ్చాక జేఏసీ నేతలతో మరోసారి చర్చలు జరుపుతామని, సమ్మె విరమింపచేసేలా చర్యలు చేపడతామని వెల్లడించారు. యూనియన్ల పునరుద్దరణ, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం వంటి అంశాలపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు. రెండో వేతన సవరణతో పాటు విశ్రాంత ఉద్యోగులకు బకాయిలు చెల్లింపు, కార్మిక సంఘాలను పునరుద్ధరించడం, ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం చేయాలని కార్మికులు డిమాండ్ చేస్తున్నారు.

Follow Us
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
300కు పైగా సినిమాలు చేసిన ఈ టాలీవుడ్ నటుడు ఎలా చనిపోయారో తెలుసా?
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ఇంటి కిటికీకి స్టీల్ స్పూన్ పెడితే ఏం జరుగుతుందో తెలుసా?..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
ప్రతీ నెలా మీ అకౌంట్లోకి రూ.3 వేలు.. కేంద్రం నుంచి సూపర్ స్కీమ్..
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
షుగర్ ఉన్నవారు కాఫీలో చెక్కరకు బదులు దాల్చిన చెక్క కలిపి తాగితే?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
వావ్.. టాయిలెట్ చుట్టూ బేకింగ్ సోడా చల్లితే ఏం జరుగుతుందో తెలుసా?
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
సుప్రీం కోర్టుకు చేరిన ఆలుగడ్డ పంచాయితీ!
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
మధ్యాహ్నం కునుకు తీయడం అలవాటైందా?.. లైట్ తీసుకుంటే డేంజరే
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
తెల్లని బట్టలు పసుపు రంగులోకి మారుతున్నాయా? బ్లీచ్ అవసరం లేదు..
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
ఆగస్ట్ 15న చరిత్ర సృష్టించనున్న టీమిండియా
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం
పట్టపగలు వరుస చోరీలు.. గంటల వ్యవధిలో రెండు ఇళ్లలో 50 సవర్ల బంగారం