Breaking: పాతబస్తీలో దారుణం.. ముగ్గురు అక్కా చెల్లెల్లు హత్య

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. కుటుంబ కలహాలతో తోబుట్టువులని చూడకుండా అతి దారుణంగా హత్య చేశాడు ఓ కసాయి. హైదరాబాద్ పాతబస్తీలో ముగ్గురు అక్కా చెల్లెల్లు దారుణ హత్యకు గురయ్యారు.

Breaking: పాతబస్తీలో దారుణం.. ముగ్గురు అక్కా చెల్లెల్లు హత్య
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 01, 2020 | 2:59 PM

మనషుల్లో మానవత్వం మంటగలుస్తోంది. కుటుంబ కలహాలతో తోబుట్టువులని చూడకుండా అతి దారుణంగా కత్తులతో హత్య చేశాడు ఓ కసాయి. హైదరాబాద్ పాతబస్తీలో ముగ్గురు అక్కా చెల్లెల్లు దారుణ హత్యకు గురయ్యారు.

చాంద్రాయణగుట్ట బార్కస్ కు చెందిన అహ్మద్‌ బా ఇస్మాయిల్‌ కుటుంబంలో చిన్నపాటి గొడవ జరిగింది. సొంత అక్కచెల్లెళ్లనే దారుణంగా కత్తులతో నరికి చంపాడు. ఇస్మాయిల్‌ గత ఏడాది భార్యను హత్య కేసులో అరెస్ట్‌ కాగా, ఇటీవలే బెయిల్‌పై విడుదలై ఇంటికి వచ్చాడు. అప్పటి నుంచి కుటుంబంలో గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ దాడి లో ముగ్గురు మహిళలు అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న చాంద్రాయణగుట్ట పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన క్లూస్ టీం ఆధారాలు సేకరిస్తోంది. ఈ ఘటనకు గల కారణాలపై పోలీసుల ఆరా తీస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న ఇస్మాయిల్‌ కోసం గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. మృతదేహాలను ఉస్మానియా మార్చురీకి తరలించారు.