Shilparamam Re-Open: కరోనా వ్యాప్తి, లాక్‌డౌన్ సమయంలో మూతపడిన టూరిజం సెంటర్లు ఇప్పుడిప్పుడే తెరుచుకుంటున్నాయి. హైటెక్ సిటీ సమీపంలోని పల్లె అందాలతో కనువిందు చేసే శిల్పారామం అక్టోబర్ 2 నుంచి సందర్శకులకు అందుబాటులోకి వచ్చింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8.30 గంటల వరకు శిల్పారామం తెరిచి ఉండనుంది. దీనిపై తాజాగా శిల్పారామం స్పెషల్ ఆఫీసర్ కిషన్ రావు స్పందించారు.
శిల్పారామంలో కఠినంగా కోవిడ్ నిబంధనలు పాటిస్తామని కిషన్ రావు అన్నారు. మాస్క్ పెట్టుకున్నవారినే అనుమతిస్తామని చెప్పిన ఆయన.. ఎవరైనా కోవిడ్ నిబంధనలు అతిక్రమిస్తే వెంటనే బైటకు పంపిస్తామని స్పష్టం చేశారు. శిల్పారామం మొత్తం శానిటైజేషన్ చేసేందుకు 4 గంటల సమయం పడుతుంది. అందుకే సమయాల్లో మార్పులు చేశామన్నారు. అలాగే శిల్పారామంలో స్టాల్ నిర్వాహకులకు ప్రత్యేక ఐడీ కార్డులు ఉంటాయని కిషన్ రావు చెప్పుకొచ్చారు.
Also Read:
గ్రామ/వార్డు వాలంటీర్లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్..
సోనూసూద్ గొప్ప మనసు.. బాలుడి వైద్యానికి రూ. 20 లక్షల సాయం..
రైల్వే ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. పండగ సీజన్‌లో 200 స్పెషల్ ట్రైన్స్.!