ఊ.. అంటే కోపాలు.. అంతలోనే తాపాలు.. ఇదే బిగ్ బాస్ సీన్!

ప్రేమ.. ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పలేం. కొంతమంది గొడవపడుతూ ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తారు. మరికొందరు అతి జాగ్రత్తల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇలా ఒక్కొక్కరి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే తీరులో ఒక జంట తమపై ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. అదీ కూడా బిగ్ బాస్ హౌస్‌లో.. హిందీ బిగ్ బాస్ ప్రస్తుతం ప్రేమలు.. కోపాలు మధ్య సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందిస్తోంది. ముఖ్యంగా సిద్ధార్థ్- షెహనాజ్‌ల మధ్య రెండు […]

ఊ.. అంటే కోపాలు.. అంతలోనే తాపాలు.. ఇదే బిగ్ బాస్ సీన్!
Follow us

|

Updated on: Jan 08, 2020 | 7:31 PM

ప్రేమ.. ఎప్పుడు ఎవరికి ఎలా పుడుతుందో చెప్పలేం. కొంతమంది గొడవపడుతూ ఎదుటి వ్యక్తి మీద ఉన్న ప్రేమను తెలియజేస్తారు. మరికొందరు అతి జాగ్రత్తల ద్వారా వ్యక్తపరుస్తారు. ఇలా ఒక్కొక్కరి మనస్తత్వాలు వేరువేరుగా ఉంటాయి. సరిగ్గా ఇప్పుడు ఇదే తీరులో ఒక జంట తమపై ఉన్న ప్రేమను వ్యక్తపరుచుకుంటున్నారు. అదీ కూడా బిగ్ బాస్ హౌస్‌లో..

హిందీ బిగ్ బాస్ ప్రస్తుతం ప్రేమలు.. కోపాలు మధ్య సగటు ప్రేక్షకుడికి వినోదాన్ని అందిస్తోంది. ముఖ్యంగా సిద్ధార్థ్- షెహనాజ్‌ల మధ్య రెండు రోజుల ముందు జరిగిన గొడవ ఫ్యాన్స్‌కు కాస్త నిరాశను కలిగించిన మాట వాస్తవమే. అయితే ఈరోజు టెలికాస్ట్ అయిన ప్రోమోలో మళ్ళీ ఇద్దరూ కూడా కలుస్తారన్న ఆశ అందరిలోనూ కలిగింది.

‘నువ్వంటే నాకు చాలా ఇష్టం రా.. హౌస్‌లో ఎంత పెద్ద గొడవ జరిగినా కూడా అందులో నీ తప్పు ఉందన్నా.. నీకే సపోర్ట్ చేశాను’.. అలాంటిది నిన్ను తిట్టి.. నీతో మాట్లాడకుండా ఎలా ఉండగలను అని షెహనాజ్ సిద్ధార్థ్‌తో చెబుతుంది. అయితే సిద్ధార్థ్ మాత్రం ఆమెను దూరం పెడుతూ తిరుగుతుంటాడు. కానీ షెహనాజ్ మాత్రం మిగతా కంటెస్టెంట్లతో మాట్లాడుతూ.. సిద్ధార్థ్‌ కోపాన్ని ఎలా తగ్గించాలో చెప్పమని అడుగుతుంది. ఇదంతా చూస్తుంటే.. మళ్ళీ వీళ్ళిద్దరూ కలిసి ఫ్యాన్స్‌కు పెద్ద ట్రీట్ ఇచ్చేలా కనిపిస్తున్నారు. ఏది ఏమైనా ప్రేమ.. పగ.. కోపం.. ఇదే ప్రస్తుత హిందీ బిగ్ బాస్ స్క్రీన్ మీద కనిపిస్తున్న దృశ్యం.