రష్యా వ్యాక్సీన్ లో అంత ‘సీన్’ ఉందా ? నిపుణుల సందేహాలు

రష్యా వ్యాక్సీన్ లో అంత 'సీన్' ఉందా ? నిపుణుల సందేహాలు

కరోనా వైరస్ వ్యాక్సీన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ప్రకటించారు.. తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి ఈ వ్యాక్సీన్ ఇవ్వగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ ఉత్పన్నం కాలేదని, ఆమె శరీరంలో..

Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Aug 11, 2020 | 5:58 PM

కరోనా వైరస్ వ్యాక్సీన్ పై రష్యా అధ్యక్షుడు పుతిన్ అధికారికంగా ప్రకటించారు.. తన ఇద్దరు కూతుళ్లలో ఒకరికి ఈ వ్యాక్సీన్ ఇవ్వగా సైడ్ ఎఫెక్ట్స్ ఏవీ ఉత్పన్నం కాలేదని, ఆమె శరీరంలో యాంటీ బాడీలు పెరిగాయని ఆయన పేర్కొన్నారు. పైగా ఈ వ్యాక్సీన్  వల్ల రెండేళ్ల వరకు కోవిడ్ ని నిరోధించేశక్తి ఉంటుందన్నారు . ప్రపంచంలో తమదే తొలి రిజిస్ట్రేషన్ అని కూడా పుతిన్ ప్రకటించుకున్నారు కూడా. మేం డెవలప్ చేసిన ఈ టీకా మందుకు అన్ని టెస్టులూ చేశాం.. సమర్ధమైనదిగా నిరూపితమైంది..అని ఆయన వెల్లడించారు.

అయితే ఈ వ్యాక్సీన్ పై అప్పుడే పలువురు నిపుణులు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మూడు క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాలంటే నెలల తరబడి సమయం పడుతుందని, పైగా రష్యా వ్యాక్సీన్ కి నిజంగా అంత సత్తా ఉందా అని తర్జనభర్జన పడుతున్నారు. అసలు తమ దేశ వ్యాక్సీన్లో ‘డేటా’అన్నది లేదని రష్యాకే చెందిన ఓ రీసెర్చర్ పేర్కొన్నారు. సురక్షితం కాని వ్యాక్సీన్ ని విడుదల చేయడంవల్ల సమస్యలు మరిన్ని ఉత్పన్నమవుతాయని మరికొందరు శాస్త్రజ్ఞులు కూడా ఆందోళన వ్యక్తమ చేశారు. పైగా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా దీనికి ఇంకా ఆమోదం తెలపని విషయాన్ని వారు గుర్తు చేశారు. ఈ సంస్థ అధికార ప్రతినిధి తరిక్ జసరేవిక్ మీడియాతో మాట్లాడుతూ.. తాము రష్యా ఆరోగ్య శాఖ అధికారులతో ఇంకా చర్చలు జరుపుతున్నామని, వీటి పర్యవసానం తేలవలసి ఉందని చెప్పారు.

మరోవైపు..క్రెమ్లిన్, దాని అధికారిక మీడియా.. ఈ వ్యాక్సీన్ ని తమ దేశ ‘ప్రిస్టేజీ’గా భావిస్తున్నాయి. ఇదివరకటి సోవియట్ ఉపగ్రహాల్లో ఒకటైన ‘స్పుత్నిక్-వి’ గా దీన్ని అబ్జివర్ణించాయి.

Video Courtesy: Mail online

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu