AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పండు ముసలి- పడుచుపిల్ల ఒక్కటయ్యారు, అంతలోనే విడిపోయారు

కాటికి కాళ్లుజాపుకున్న ఓ వృద్ధుడు ఓ టీనేజ్‌ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ఆ కాపురం సజావుగా సాగుతుందా? చచ్చినా సాగదు.. ఇండోనేషియాలో అదే జరిగింది..

పండు ముసలి- పడుచుపిల్ల ఒక్కటయ్యారు, అంతలోనే విడిపోయారు
Balu
| Edited By: |

Updated on: Nov 06, 2020 | 2:11 PM

Share

కాటికి కాళ్లుజాపుకున్న ఓ వృద్ధుడు ఓ టీనేజ్‌ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే.. ఆ కాపురం సజావుగా సాగుతుందా? చచ్చినా సాగదు.. ఇండోనేషియాలో అదే జరిగింది.. ఒకప్పటి కన్యాశుల్కం అనే మాచెడ్డ సంప్రదాయం ఇండోనేషియాలో ఇంకా ఉన్నట్టుగా ఉంది.. అందుకే ఆ పిల్లకు మాయమాటలు చెప్పి పెళ్లి చేసుకున్నాడో 78 ఏళ్ల వృద్ధుడు.. ఆ ముసలోడి పేరు అబా సర్నా.. తనకంటే 61 ఏళ్లు చిన్నదైన నోవని నవిత అనే అమ్మాయిని బంధుమిత్రుల సమక్షంలో చాలా గ్రాండ్‌గా పెళ్లి చేసుకున్నాడు.. పెళ్లి సందర్భంగా నోనికి బోలెడన్ని కానులకను సమర్పించుకున్నాడు..ఓ మోటార్‌ సైకిల్‌ కొనిచ్చాడు.. 50 వేల రూపాయలు కానుకగా ఇచ్చాడు.. ఇంకా చాలా ఇచ్చాడు.. ఇండోనేషియాలో వధువుకు వరుడు కట్నం ఇవ్వడమనే సంప్రదాయం ఉందట! అయితే అక్కడ కాళ్లకు పారాణి పూసుకోవడమనే ట్రెడిషన్‌ ఉందో లేదో కానీ పూసుకుంటే మాత్రం అది ఆరకముందే విడాకుల కోసం కోర్టుకెక్కారు కొత్త దంపతులు.. ఒకరి మీద ఒకరు నిందేసుకున్నారు.. అసలు వాళ్లిద్దరి మధ్య ఎలాంటి ప్రాబ్లమ్స్‌ లేవని, డైవర్స్‌ ఎందుకు కోరుకుంటున్నారో అర్థం కావడం లేదని అంటున్నారు అమ్మాయి తరఫు బంధువులు.. అబా సర్నాతో తమకు సమస్యలు లేవని, బహుశా ఆయన కుటుంబ సభ్యులకు ఈ పెళ్లి నచ్చకపోవచ్చని చెప్పుకొస్తున్నారు. అబా సర్నా ఫ్యామిలీ మెంబర్లు మాత్రం ఇంకో కారణం చెబుతున్నారు.. పెళ్లికి ముందే నోని గర్భవతి అని, అది దాచిపెట్టి పెళ్లి చేశారని ఆరోపిస్తున్నారు. నోని తరఫు బంధువులు మాత్రం అనవసరంగా తమపై నీలాపనిందలు వేస్తున్నారని ఆరోపణలను తిప్పికొడుతున్నారు.. ఏదైతేనేం చూడముచ్చటైన జంట విడిపోతున్నది..