కిరణ్ బేడీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాలనకు సంబంధించిన రోజువారీ అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేగాక.. కీలక విషయాల్లో ఆమె స్వతంత్రంగా వ్యవహరించే అధికారం కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది. లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలను ప్రశ్నిస్తూ పుదుచ్చేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ 2017లో మద్రాసు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులోని మదురై బెంచ్‌ విచారణ […]

కిరణ్ బేడీకి మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ
Follow us

| Edited By:

Updated on: Apr 30, 2019 | 3:40 PM

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీకి మద్రాస్‌ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పాలనకు సంబంధించిన రోజువారీ అంశాల్లో జోక్యం చేసుకునే అధికారం లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌బేడీకి లేదని న్యాయస్థానం తేల్చి చెప్పింది. అంతేగాక.. కీలక విషయాల్లో ఆమె స్వతంత్రంగా వ్యవహరించే అధికారం కూడా లేదని కోర్టు స్పష్టం చేసింది.

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ అధికారాలను ప్రశ్నిస్తూ పుదుచ్చేరి కాంగ్రెస్‌ ఎమ్మెల్యే లక్ష్మీనారాయణ 2017లో మద్రాసు హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై హైకోర్టులోని మదురై బెంచ్‌ విచారణ చేపట్టి ఇవాళ తీర్పు వెల్లడించింది. ఆర్థిక, పాలన, సేవలకు సంబంధించిన వ్యవహారాల్లో స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అధికారం కిరణ్‌బేడీకి లేదని, ఇలాంటి విషయాల్లో కేబినెట్‌ను సంప్రదించి సలహాలు తీసుకోవాలని కోర్టు పేర్కొంది.

పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ స్వతంత్రంగా వ్యవహరించొచ్చని, కీలక నిర్ణయాల్లో మంత్రిమండలిని సంప్రదించాల్సిన అవసరం లేదని రెండేళ్ల క్రితం కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కిరణ్‌బేడీ, పుదుచ్చేరి ముఖ్యమంత్రి వి. నారాయణస్వామి మధ్య విభేదాలు తలెత్తాయి.