అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

|

Apr 30, 2020 | 7:53 PM

కరోనా వైరస్ సోకి మృత్యువాత పడిన వ్యక్తుల అంత్యక్రియల విషయంలో ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతిమ సంస్కారాలు అడ్డుకోవడం కరెక్ట్ కాదని సీఎం వ్యాఖ్యానించారు.

అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్
Follow us on

కరోనా వైరస్ సోకి మృత్యువాత పడిన వ్యక్తుల అంత్యక్రియల విషయంలో ఎవరైనా అడ్డుకోవడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారు. అంతిమ సంస్కారాలు అడ్డుకోవడం కరెక్ట్ కాదని సీఎం వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ వ్యాప్తి నియంత్రణపై గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో కర్నూలులో కరోనా సోకిన వ్యక్తి మరణిస్తే అతని అంత్యక్రియలను అడ్డుకున్న ఉదంతంపై ప్రత్యేకంగా చర్చించారు.

ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలను అడ్డుకోవడం సరి కాదని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. ‘‘మనకే ఇలాంటివి జరిగితే ఎలా స్పందిస్తాం.. అలాగే అందరూ స్పందించాలి.. ఎవరైనా అలాంటి పనులు చేస్తే సీరియస్‌గా స్పందించాలి…’’ ఇవి ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్‌కు ఇచ్చిన ఆదేశాలు. కరోనా వైరస్ సోకి ఆ వ్యక్తి మరణిస్తే ఎలాంటి మార్గదర్శకాలను పాటించాలో కేంద్ర ప్రభుత్వం ఇదివరకే రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసిందని, వాటి ప్రకారమే కరోనా వైరస్‌తో ఎవరైనా మరణిస్తే చర్యలు తీసుకోవాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఎవరైనా అంత్యక్రియలను అడ్డుకున్నా.. తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో అయోమయం సృష్టించేందుకు ప్రయత్నం చేసినా కఠినంగా వ్యవహరించాలని రాష్ట్ర డీజీపీని కోరారు ముఖ్యమంత్రి. “కరోనా వైరస్ ఎవరికైనా సోకవచ్చు.. ఇలా అడ్డుకున్న వారికి కూడా వైరస్ సోకే ప్రమాదం ఉంది.. అలాంటప్పుడు కరోనా వైరస్ వచ్చినవారిని అంటరానివాళ్ళుగా చూడటం కరెక్ట్ కాదు.. వైరస్ సోకిన వారి మీద సానుభూతి చూపించాలి.. ఆప్యాయత ప్రదర్శించాలి.. అంతేకానీ వివక్ష చూపడం కరెక్ట్ కాదు” అని అన్నారు ముఖ్యమంత్రి.

అంత్యక్రియల విషయంలో ఏర్పడిన గందరగోళాన్ని నివారించేందుకు బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్న వారు ప్రయత్నం చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. మంచి పొజిషన్‌లో ఉన్నవారు అంత్యక్రియలను అడ్డుకోవడం సరికాదని హెచ్చరించారు. ‘‘కరోనా వైరస్ వస్తే మందులు తీసుకుంటే పోతుంది వైరస్ సోకిన వారిని అంటరానివారిగా చూడటం సరికాదు.. తప్పుడు ప్రచారాలు ప్రోత్సహించడం అంతకంటే సరికాదు..’’ అని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ సోకితే మరణమే శరణ్యమని ఎవరూ భావించవద్దని ముఖ్యమంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా మరణాల రేటు 3.26 శాతం మాత్రమే ఉందని, మిగిలిన వారు తగిన చికిత్స పొంది వైరస్ నుంచి విముక్తి పొంది, డిశ్చార్జ్ అవుతున్నారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు