ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

రాష్ట్ర ఆదాయం జీరోకి చేరడంతో పాటు కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉండటంతో ఖజానాపై భారం పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాను నింపేందుకు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు ముఖ్యమంత్రి జగన్.

ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:50 PM

లాక్ డౌన్ కారణంగా దారుణంగా పడిపోయిన రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలపై దృష్టి సారించారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి. సుమారు నలభై రోజులుగా కొనసాగుతున్న లాక్‌డౌన్ కారణంగా రాష్ట్ర ఆదాయం జీరోకి చేరడంతో పాటు కరోనా వైరస్ నియంత్రణ చర్యలకు భారీ ఎత్తున ఖర్చు చేయాల్సి ఉండటంతో ఖజానాపై భారం పెరిగి పోయింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాను నింపేందుకు ప్రత్యేక చర్యలకు ఉపక్రమించారు ముఖ్యమంత్రి జగన్.

రాష్ట్ర రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి రజత్ భార్గవను నియమించారు ముఖ్యమంత్రి. ఆదాయ ఆర్జనలో విశేష అనుభవం కలిగిన రజత్ భార్గవపై ఆదాయం పెంచే గురుతర బాధ్యతను మోపారు ముఖ్యమంత్రి. గతంలో కేంద్ర ఆర్థిక శాఖలో కీలక విధులు నిర్వహించిన రజత్ భార్గవ.. కేంద్ర బడ్జెట్‌ల రూపకల్పనలోనూ అనుభవం ఉన్న అధికారి. 1990s బ్యాచ్‌కు చెందిన రజత్ భార్గవ ప్రస్తుతం ఏపీ రెవెన్యూ శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించనున్నారు.

మే 3వ తేదీ తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో లాక్ డౌన్ సడలింపులు పెద్ద ఎత్తున అమల్లోకి వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఆ తర్వాత రాష్ట్ర ఆదాయాన్ని పెంచుకునే దిశగా చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అందుకే ప్రత్యేక ప్రణాళికలు రూపొందించేందుకు, పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనలో తగిన సలహాలు, సూచనలు చేసేందుకు రెవెన్యూ శాఖలో రజత్ భార్గవను నియమించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

మార్చి నెలలో బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను ఆమోదింప చేసుకొని, జూన్ లేదా జులై నెలల్లో పూర్తిస్థాయి బడ్జెట్‌కు వెళ్ళాలని ముఖ్యమంత్రి గతంలో భావించారు. అయితే అనుకోని విపత్తు రూపంలో కరోనా వైరస్ ప్రభావం వచ్చి పడటంతో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించలేక పోయారు. ప్రస్తుతం లాక్ డౌన్ ముగింపు దశకు చేరుకుందని అందరూ భావిస్తున్న నేపథ్యంలో వచ్చే రెండు, మూడు నెలలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత కీలకమని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఖజానాను నింపేందుకు మార్గాలను ముఖ్యమంత్రి అన్వేషిస్తున్నారు. ఇందులో భాగంగానే రజత భార్గవను నియమించినట్లుగా తెలుస్తోంది.

లాక్ డౌన్ పీరియడ్ ముగిసిన వెంటనే రాష్ట్ర ఆదాయ మార్గాలకు బూస్ వచ్చేలా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. అదే సమయంలో రెండు నెలల వ్యవధిలో పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు ఆర్థిక శాఖను సమాయత్తం చేస్తున్నారు. ఈ మొత్తం ప్రక్రియలో రజత్ భార్గవ అత్యంత కీలకం కాబోతున్నారని సమాచారం.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు