పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

దేశంలో త్వరలో రైలు పట్టాలెక్కబోతున్నాయా? లాక్‌డౌన్ పక్కన పెట్టి మరి కేంద్రం రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందా? తాజాగా వినిపిస్తున్న డిమాండ్లు.. తాజా పరిణామాలు నిజమేనని చెబుతున్నాయి.

పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:51 PM

దేశంలో త్వరలో రైలు పట్టాలెక్కబోతున్నాయా? లాక్‌డౌన్ పక్కన పెట్టి మరి కేంద్రం రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందా? తాజాగా వినిపిస్తున్న డిమాండ్లు.. తాజా పరిణామాలు నిజమేనని చెబుతున్నాయి. దేశంలో రెండు, మూడు రోజుల్లో రైలు ప్రయాణాలు ప్రారంభం కావచ్చని అంచనాలు వినిపిస్తున్నాయి.

మార్చి నెలలో లాక్‌డౌన్ ప్రకటించక ముందు నుంచే దేశంలో రైలు ప్రయాణాలు నిలిచిపోయాయి. గూడ్స్ రైళ్ళు తప్ప ప్రయాణికుల రైళ్ళు పూర్తిగా ఆగిపోయాయి. ఈ నేపథ్యంలో పలుమార్లు టికెట్ల జారీకి సిద్ధమైన రైల్వేశాఖ.. కేంద్ర హోంశాఖ వార్నింగ్‌తో వెనక్కి తగ్గింది. అయితే తాజాగా దేశంలో రైలు ప్రయాణాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ఢిల్లీ వర్గాల భోగట్టా.

లాక్ డౌన్ నేపథ్యంలో గత నలభై రోజులుగా వివిధ రాష్ట్రాలలో చిక్కుకుపోయిన వలస కార్మికులు, వారి కుటుంబీకులను తమ స్వస్థలాలకు తిరిగి వెళ్లి పోవచ్చని కేంద్ర హోంశాఖ అనుమతించింది. కేంద్ర హోం శాఖ అనుమతి మంజూరు చేసినప్పటికీ ఆయా రాష్ట్రాలు తమ రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళిన కార్మికులను ప్రత్యేక బస్సులలో మాత్రమే తిరిగి రప్పించుకునే వెసులుబాటును హోంశాఖ కల్పించింది.

అయితే వలస కార్మికులు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేసి తమ రాష్ట్రాలకు చేరుకోవడం కరెక్ట్ కాదని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు, అదే సమయంలో ఇతర రాష్ట్రాలకు ప్రత్యేక బస్సులను పంపి తమ వారిని తప్పించుకోవడం అంత సులభం కాదని మరి కొన్ని రాష్ట్రాలు వాదన మొదలుపెట్టాయి. తెలంగాణ ప్రభుత్వం సైతం ఇతర రాష్ట్రాల్లో ఉన్న తమ రాష్ట్ర కార్మికులను ప్రత్యేక రైళ్లలో తరలించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ యాదవ్ కేంద్ర హోంశాఖ మంత్రిని గురువారం కోరారు.

వలస కార్మికులు రోడ్డు మార్గం ద్వారా ప్రయాణం చేస్తూ మార్గమధ్యంలో ఇతరులకు కరోనా వైరస్ తగ్గించే అవకాశం ఉందని మరికొందరు వాదన మొదలు పెట్టారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక రైళ్లకు అనుమతులు మంజూరు చేసే అవకాశాలను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెండు మూడు రోజుల వ్యవధిలో కొన్ని ప్రత్యేక రైళ్లను అనుమతించి వలస కార్మికులు వీలైనంత త్వరగా వారి స్వస్థలాలకు చేరుకునేలా చేయడం మంచిదన్న అభిప్రాయం కేంద్ర ప్రభుత్వ వర్గాల్లో వ్యక్తమవుతోంది. దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఈ మేరకు విజ్ఞప్తి చేయడంతో రెండు మూడు రోజుల పాటు ప్రత్యేక రైళ్ళను నడిపే అవకాశాలను కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోందని సమాచారం. ఏ క్షణమైనా దీనికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది.

Read this: ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు

నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
నా జీవితంలో శివుడు అద్భుతాలు చేశాడు.! కాఫీ కూడా దొరికని పరిస్థితి
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
వందల కోట్ల ఆస్తిని వదిలేసి.. సన్యాసంలోకి భార్యభర్తలు..
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
మండు వేసవిలో చల్లని కబురు.. 10 రోజులు వానలే వానలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
భక్తులకు గుడ్ న్యూస్‌.. ఇంటి వద్దకే భద్రాద్రి రామయ్య తలంబ్రాలు.!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
అతనితో డేటింగ్ చేసేటప్పుడు నన్ను చాలా అన్నారు.. ప్రియమణి ఎమోషనల్!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
కరిచినపామును వెంటపెట్టుకుని ఆస్పత్రికి వెళ్లిన మహిళ..ఆ తర్వాత.!
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
ఇకపై అలా చేయకూడదని నిర్ణయించుకున్నా.! చిరంజీవి కామెంట్స్ వైరల్.
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
180 మంది పిల్లలకు తండ్రి! ఒక్కమహిళ కూడా ప్రేమగా ముద్దివ్వలేదట.?
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
ఏలూరు జిల్లాలో కొనసాగుతోన్న జగన్‌ బస్సుయాత్ర..
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.
పాపం ఇస్మార్ట్ బ్యూటీ.. పవన్‌ను నమ్ముకున్నా.. ఫలితం మాత్రం నిల్‌.