Breaking ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్

ఒకవైపు దేశం యావత్తూ కరోనా వైరస్‌పై సమరంలో బిజీగా ఉన్న తరుణంలో ఉగ్ర కుట్రకు తెరలేచింది. దేశ రాజధానిలోని తీహార్ జైల్లో పలు ప్రాంతాల్లోని దేవాలయాలలో అమలు పరిచేందుకు భారీ కుట్రకు ప్రణాళిక రూపొందించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి.

Breaking ప్రసాదాలలో విషం.. ఉగ్రకుట్రకు తీహార్‌లో స్కెచ్
Follow us

|

Updated on: Apr 30, 2020 | 7:55 PM

ఒకవైపు దేశం యావత్తూ కరోనా వైరస్‌పై సమరంలో బిజీగా ఉన్న తరుణంలో ఉగ్ర కుట్రకు తెరలేచింది. దేశ రాజధానిలోని తీహార్ జైల్లో పలు ప్రాంతాల్లోని దేవాలయాలలో అమలు పరిచేందుకు భారీ కుట్రకు ప్రణాళిక రూపొందించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. ఈ ఉగ్ర కుట్రకు సూత్రధారి హైదరాబాద్ నగరానికి చెందినవాడు కావడం కుట్రలో హైలైట్.

దేశంలో పలుచోట్ల ఉగ్రవాద దాడులకు తీహార్ జైల్లో కుట్ర జరిగింది. హైదరాబాద్‌కు చెందిన ఉగ్రవాది ఈ స్కెచ్ వేసినట్లుగా ఇంటలిజెన్స్ వర్గాలు గుర్తించాయి. జైల్లో ఖైదీగా ఉంటూ ఓ వర్గం యువతకు ఈ హైదరాబాదీ.. ఉగ్ర పాఠాలు బోధిస్తున్నట్లు గుర్తించారు. ఇరాన్ దేశానికి చెందిన జంట ఈ ఉగ్ర కుట్ర గుట్టు విప్పింది.

గతంలో ఐసిస్‌లో చేరేందుకు సిరియా వెళ్లడానికి ప్రయత్నం చేసి, మహారాష్ట్రలో పోలీసులకు చిక్కిన ఈ హైదరాబాదీని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) గతంలో అదుపులోకి తీసుకొని విచారించింది. ఆ తర్వాత జ్యుడీషియల్ రిమాండ్‌పై తీహార్ జైలుకు తరలించింది. జైల్లో ఉన్న ఈ హైదరాబాదీ.. దేశవ్యాప్తంగా పలు దేవాలయాలలో అమలు చేసేందుకు ఓ ఉగ్ర కుట్రను రూపొందించాడు. అదే జైల్లో ఉన్న ఓ వర్గానికి చెందిన యువకులను రెచ్చ కొట్టడం మొదలు పెట్టాడు. తాను నిర్దేశించిన టార్గెట్‌లపై ఈ యువత ఒంటరిగా దాడికి దిగేలా ఉసిగొల్పడం మొదలు పెట్టాడు. ఈ హైదరాబాదీ యువకుడిని 2018లో తెలంగాణ పోలీసులు కూడా ఓసారి అరెస్టు చేసినట్లు సమాచారం.

ఈ హైదరాబాదీ ఉగ్రవాది తీహార్ జైల్లో పన్నుతున్న కుట్రను ఇరాన్ దేశానికి చెందిన ఖొరాసన్‌ మోడ్యూల్ ప్రాంతానికి చెందిన ఓ జంట బయటపెట్టింది. ఉగ్రవాది యాక్షన్ ప్లాన్‌లో మన దేశంలోని పలు దేవాలయాలు ఉన్నట్లు ఈ జంట ఇంటెలిజెన్స్ వర్గాలకు తెలిపింది. పలు ప్రధాన దేవాలయాల్లో భక్తులకు వితరణ చేస్తున్న ప్రసాదాలలో విషం కలపాలన్నది ఈ హైదరాబాద్ ఉగ్రవాది కుట్ర అని ఇంటెలిజెన్స్ విభాగానికి ఈ ఇరాన్ జంట తెలిపినట్లు సమాచారం. వారు తెలిపిన వివరాల ప్రకారం సదరు హైదరాబాద్ యువకుడిని ప్రశ్నించేందుకు జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) సిద్ధమవుతోంది.

Read this: కరోనా కేసుల సంఖ్యపై అనుమానాలు.. కేసీఆర్ స్పందించాలన్న ఉత్తమ్

Read this: పరిణయోత్సవాలపై టీటీడీ సంచలన నిర్ణయం

Read this: అంత్యక్రియలు అడ్డుకుంటే అలా చేయండి.. డీజీపీకి జగన్ డైరెక్షన్

Read this: ఒకే గదిలో 40 మంది.. తెలుగోళ్ళ ‘మహా’ కష్టం

Read this: పార్లమెంటు నిర్మాణం వద్దంటే షాకే..!

Read this: పట్టాలెక్కనున్న రైళ్ళు..! రీజన్ ఇదే

Read this: ఆదాయమార్గాలపై సీఎం నజర్.. అందుకే ఆయన నియామకం

Read this: చెల్లని విరాళంతో ప్రచార ఆర్భాటం.. రేవంత్‌పై టీఆర్ఎస్ ధ్వజం

Read this: మత్స్యకారులకు మహర్దశ.. సీఎం ప్లాన్ లీక్ చేసిన మంత్రి

Read this: లాక్ డౌన్ తర్వాత మోడీ యాక్షన్ ప్లాన్

Read this: Breaking మరిన్ని ఆంక్షల సడలింపు