AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తుని రైలు దగ్ధం ఘటనపై రైల్వే కోర్టు సంచలన తీర్పు

తుని రైలు దగ్ధం ఘటనపై రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ళపాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. ఐదేళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే మీరు ప్రవేశపెట్టారని తెలిపింది.

తుని రైలు దగ్ధం ఘటనపై రైల్వే కోర్టు సంచలన తీర్పు
Train Fire
Aravind B
|

Updated on: May 01, 2023 | 5:07 PM

Share

తుని రైలు దగ్ధం ఘటనపై విజయవాడ రైల్వే కోర్టు సంచలన తీర్పు ప్రకటించింది. ముగ్గురు రైల్వే ఉన్నతాధికారులు సరిగా విచారణ చేయలేదన్న న్యాయస్థానం.. వారిపై చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. సున్నితమైన అంశాన్ని ఐదేళ్ళపాటు ఎందుకు సాగదీశారని కోర్టు ప్రశ్నించింది. ఐదేళ్లలో ఒక్క సాక్షిని మాత్రమే మీరు ప్రవేశపెట్టారని తెలిపింది. ఈ కేసులో పోలీస్ ఉన్నతాధికారులపై ఎందుకు చర్యలు తీసుకో కూడదో వివరణ ఇవ్వాలని కోరింది. ఆధారాలు లేని కారణంగా కేసులో నిందితులుగా ఉన్న 41 మందిపై పెట్టిన కేసును అక్రమ కేసుగా పరిగణిస్తున్నామని న్యాయస్థానం పేర్కొంది.

గతంలో కాపులకు 5 శాతం రిజర్వేషన్లు ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోకపోవడంతో కాపులు ఉద్యమించారు. 2016లో తూర్పుగోదావరి జిల్లాలో నిర్వహించిన రైలు రోకో సందర్భంగా మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం సహా పలువురు కాపు ఉద్యమ నేతల పిలుపు మేరకు ఆందోళనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే కొంతమంది దుండగులు తుని రైల్వే స్టేషన్ సమీపంలో రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌ను తగులబెట్టారు.

అనంతరం వైసీపీ సర్కారు అధికారంలోకి వచ్చాక ఈ ఘటనపై గతంలో నమోదు చేసిన కేసుల్ని ఎత్తేసింది. కానీ విజయవాడ రైల్వే కోర్టులో మాత్రం ఈ కేసులు అలాగే ఉండటంతో ఉద్యమనేత ముద్రగడ పద్మనాభంతో పాటు ఇతర నిందితులకూ గత ఏడాది సమన్లు కూడా జారీ అయ్యాయి. అయితే తాజాగా ఈ ఘటనపై విజవాడ రైల్వే కోర్టు తీర్పు వెల్లడించింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
పొట్ట ఉబ్బి.. మేత మేయని ఆవు.. వెటర్నరీ డాక్టర్లు పరీక్షించగా..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
శ్రీమంతం ముచ్చట తీరకముందే.. మృత్యువును ఆశ్రయించింది..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
సముద్రం మీద ఇల్లు.. నీటి అడుగున వింత లోకం..వీళ్లు మనుషులు కాదు..
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
అందంలో హీరోయిన్లను మించిపోయింది.. ఒక్క ప్రమాదంతో కెరీర్ నాశనమైంది
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
ఒక్కసారిగా పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే..?
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
పనస పండు వీరికి యమడేంజర్.. తింటే ఏం జరుగుతుందో తెలిస్తే..
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఎవర్‌గ్రీన్.. ఆంధ్రా స్టైల్ స్పెషల్ చేపల పులుసు.. ఇలా చేసుకోండి
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
ఇది మాములూ ఆకుకూర కాదు.. ఏడాది పొడవునా ఫ్రెష్‌గా..
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
జస్ట్ 10 మినెట్స్.. రాగి అంబలిని ఇలా చేసి తాగితే.. క్షణాల్లో
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్
మ్యాచ్ తర్వాత వైభవ్ సూర్యవంశీకి స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన విరాట్