AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా

JBL Pulse 6.. మ్యూజిక్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రముఖ ఆడియో బ్రాండ్ జెబీఎల్ నుంచి మరో కొత్త అద్భుతమైన స్పీకర్ మార్కెట్‌లోకి రానుంది. పార్టీలు, ట్రిప్స్, ఇండోర్ ఎంటర్‌టైన్‌మెంట్ కోసం బ్లూటూత్ స్పీకర్ల వాడకం ప్రస్తుతం విపరీతంగా పెరిగింది. ఈ నేపథ్యంలో JBL సంస్థ తమ సరికొత్త పల్స్ సిరీస్ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకురావడానికి ముమ్మరంగా సన్నాహాలు చేస్తోంది.

అదిరిపోయే బ్రాండెడ్​ బ్లూటూత్ స్పీకర్ కొనాలనుకుంటున్నారా? JBL పల్స్​6 స్పీకర్ వివరాలు తెలుసా
Jbl Pulse 6 Bluetooth Speaker
Nikhil
|

Updated on: Aug 17, 2026 | 9:00 PM

Share

ప్రముఖ ఆడియో బ్రాండ్ JBL తన పల్స్ సిరీస్‌లో భాగంగా ‘JBL పల్స్ 6’ స్పీకర్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. 360-డిగ్రీ కలర్‌ఫుల్ లైటింగ్, 40W పవర్‌ఫుల్ ఆడియో, IP68 వాటర్ ప్రొటెక్షన్‌తో వస్తున్న ఈ స్పీకర్ పార్టీ మూడ్‌ను పూర్తిగా మార్చేయడానికి సిద్ధంగా ఉంది. అద్భుతమైన లైటింగ్ ఎఫెక్ట్స్, పవర్‌ఫుల్ సౌండ్‌కు పేరుగాంచిన పల్స్ సిరీస్‌లో వస్తున్న ఈ లేటెస్ట్ మోడల్ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

40W పవర్‌ఫుల్ ఆడియో పర్ఫార్మెన్స్

JBL పల్స్ సిరీస్ అనగానే మనకు ముందుగా గుర్తువచ్చేది దాని అద్భుతమైన కలర్‌ఫుల్ లైటింగ్. JBL పల్స్ 6 మునుపటి మోడల్స్ కంటే మరింత ఆకర్షణీయమైన 360-డిగ్రీ లైట్ షోతో వస్తోంది. మ్యూజిక్ బీట్స్‌కు తగినట్లుగా లైట్లు మారుతుండటం వల్ల ఇది పార్టీలకు పర్ఫెక్ట్ లుక్‌ను ఇస్తుంది. దీని కాంపాక్ట్ డిజైన్ కారణంగా ఎక్కడికైనా చాలా ఈజీగా తీసుకెళ్లవచ్చు.

ఈ స్పీకర్ అతిపెద్ద హైలైట్ దీని సౌండ్ క్వాలిటీ. JBL పల్స్ 6 సుమారు 40W పవర్‌ఫుల్ ఆడియో అవుట్‌పుట్‌తో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది చిన్నపాటి పార్టీలకు లేదా గ్యాదరింగ్స్‌కు సరిపోయేంత గట్టిగా, స్పష్టమైన బేస్‌ను అందిస్తుంది. క్రిస్టల్ క్లియర్ వోకల్స్, డీప్ బేస్ కోరుకునే మ్యూజిక్ లవర్స్‌కు ఈ స్పీకర్ ఒక అద్భుతమైన ఫీల్ ఇస్తుంది.

IP68 ప్రొటెక్షన్

బయట ట్రిప్స్‌కు వెళ్లే వారికి లేదా పూల్ పార్టీలు చేసుకునేవారికి సేఫ్టీ చాలా ముఖ్యం. దీన్ని దృష్టిలో ఉంచుకుని JBL పల్స్ 6కు IP68 రేటింగ్‌ను అందించారు. దీనివల్ల నీటిలో పడినా లేదా ధూళి సోకినా స్పీకర్‌కు ఎలాంటి నష్టం జరగదు. వర్షాకాలంలో లేదా బీచ్‌ల వద్ద కూడా ఎలాంటి టెన్షన్ లేకుండా మ్యూజిక్‌ను ఎంజాయ్ చేయవచ్చు. ఒకసారి ఛార్జ్ చేస్తే ఎక్కువ గంటల పాటు మ్యూజిక్ అందించే శక్తివంతమైన బ్యాటరీని ఇందులో అమర్చారు.

ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉండటంతో తక్కువ సమయంలోనే ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. అలాగే లేటెస్ట్ బ్లూటూత్ వెర్షన్ సపోర్ట్ ఉండటంతో ఫోన్ లేదా ల్యాప్‌టాప్ త్వరగా, హై-స్టెబిలిటీతో కనెక్ట్ అవుతుంది. దీని ధర రూ.19,990 నుంచి రూ.22,990 మధ్య ఉండొచ్చని టెక్ నిపుణులు భావిస్తున్నారు. త్వరలోనే అధికారిక లాంచ్ డేట్ ప్రకటించే అవకాశం ఉంది.

Follow Us
అదిరిపోయే ఫీచర్లతో JBL పల్స్ 6 స్పీకర్
అదిరిపోయే ఫీచర్లతో JBL పల్స్ 6 స్పీకర్
రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. దీని సాగుతో రికార్డు..!
రూ.10 వేలతో మొదలుపెట్టి రూ.3 కోట్లు.. దీని సాగుతో రికార్డు..!
భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..
భోగాపురానికి విమానమొచ్చెనట.. ఏం పిల్లడో వెళ్దమొస్తవా..
ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే!వీడియో చూశారంటే
ఓరీ దేవుడో ఇలాంటి జామకాయలు తిన్నారంటే మీ పని ఖతమే!వీడియో చూశారంటే
తక్కువ శ్రమతో ఇంటిని మెరిపించే బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు
తక్కువ శ్రమతో ఇంటిని మెరిపించే బెస్ట్ డైసన్ వ్యాక్యూమ్ క్లీనర్లు
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
యాపిల్ సైడర్ వెనిగర్ ఎలా వాడాలి? ఈ తప్పులు చేస్తే అంతే సంగతులు
గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు.. ఏంటంటే
గూగుల్ కొత్త స్మార్ట్‌వాచ్ ఫీచర్లు తెలిస్తే షాకవుతారు.. ఏంటంటే
బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
బ్లాక్ హోల్‌పై అధ్యాయనం చేస్తున్న హైదరాబాదీ సైంటిస్ట్!
స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. చెక్ చేస్తే..!
స్పీకర్ బాక్స్‌లో మ్యూజిక్ బదులు వింత శబ్ధాలు.. చెక్ చేస్తే..!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!
లవంగాలను రాత్రంతా నీటిలో నానబెట్టి తాగితే ఎన్ని ప్రయోజనాలో!