రేపే గొల్లపూడి అంత్యక్రియలు.. ఎక్కడంటే..?
ప్రముఖ సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. బంధువులంతా విదేశాల్లో ఉండటంతో అంత్యక్రియలను ఆలస్యంగా.. నిర్వహించాల్సి వస్తోందని ఆయన కుమారుడు రామకృష్ణ ఇప్పటికే తెలిపారు. కాగా.. చెన్నైలోని గొల్లపూడి ఇంటికి సినీ ప్రముఖుల తాకిడి పెరిగింది. గొల్లపూడి భౌతిక కాయానికి రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు.. కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇవాళ ఉదయం వరకే.. ఆస్పత్రిలో గొల్లపూడి భౌతిక కాయాన్ని ఉంచిన […]
ప్రముఖ సీనియర్ నటులు గొల్లపూడి మారుతీరావు అంత్యక్రియలు రేపు చెన్నైలో జరగనున్నాయి. బంధువులంతా విదేశాల్లో ఉండటంతో అంత్యక్రియలను ఆలస్యంగా.. నిర్వహించాల్సి వస్తోందని ఆయన కుమారుడు రామకృష్ణ ఇప్పటికే తెలిపారు. కాగా.. చెన్నైలోని గొల్లపూడి ఇంటికి సినీ ప్రముఖుల తాకిడి పెరిగింది. గొల్లపూడి భౌతిక కాయానికి రాజకీయ, సినీ ప్రముఖులు నివాళులు అర్పిస్తున్నారు. రేపు ఉదయం 11.30 గంటలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు.. కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇవాళ ఉదయం వరకే.. ఆస్పత్రిలో గొల్లపూడి భౌతిక కాయాన్ని ఉంచిన కుటుంబసభ్యులు.. మధ్యాహ్నం ఇంటికి తీసుకొచ్చారు. సినీ తారలు, అభిమానుల సందర్శనార్థం ఉంచడంతో.. తెలుగు, తమిళ రంగాలకు చెందిన సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. చిరంజీవి, భానుచందర్, సుహాసిని, సింగీతం శ్రీనివాసరావుతో పాటు ఇతర ప్రముఖులు ఆయన మృతికి సానుభూతి వ్యక్తం చేస్తున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి.. ఆయనతో ఉన్న అనుబంధాన్ని పెంచుకున్నారు.