అలిపిరిలో మరోసారి భద్రతా సిబ్బంది వైఫల్యం, అన్యమత నినాదాలతో నేరుగా తిరుమలకు వచ్చిన వాహనం

తిరుమల శ్రీవారి కొండపై మరోసారి నిఘా వైఫల్యం బయట పడింది. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలలో లోపాలు బయటపడ్డాయి.

  • Ram Naramaneni
  • Publish Date - 12:51 pm, Thu, 17 December 20
అలిపిరిలో మరోసారి భద్రతా సిబ్బంది వైఫల్యం, అన్యమత నినాదాలతో నేరుగా తిరుమలకు వచ్చిన వాహనం

Tirumala Tirupati : తిరుమల శ్రీవారి కొండపై మరోసారి నిఘా వైఫల్యం బయట పడింది. అలిపిరి చెక్ పోస్ట్ వద్ద భద్రతా సిబ్బంది తనిఖీలలో లోపాలు బయటపడ్డాయి. అన్యమత నినాదాలతో  వాహనం నేరుగా తిరుమలకు వచ్చింది. అలిపిరి తనిఖీల్లో విజిలెన్స్ సిబ్బంది సదరు వాహనాన్ని గుర్తించలేకపోయారు. తిరుమల కొండపై  ఇతర మతాల గుర్తులు, నినాదాల నిషేధం అమలులో ఉన్న విషయం తెలిసిందే. దీంతో వెంటనే అప్రమత్తమైన విజిలెన్స్ అధికారులు..సదరు వాహనాన్ని వెక్కి తిప్పి పంపించారు.  అయితే గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నా భద్రతా సిబ్బంది నిర్లక్ష్యం మాత్రం వీడకపోవడంతో శ్రీవారి భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Also Read : 

హెచ్‌సీఏకు మరో ఎదురుదెబ్బ, కొత్త సీజన్‌‌లో ఆంధ్రా నుంచి బరిలోకి అంబటి..కారణాలు ఇవే

Gold Rate Today : రెండో రోజూ స్వల్పంగా పెరిగిన పసిడి ధర, వివిధ నగరాల్లో రేట్లు ఇలా ఉన్నాయి

అనంతపురం నగరంలో కలకలం..పురాతన చెన్నకేశవ స్వామి ఆలయ గోపురం ధ్వంసం చేసేందుకు దుండగుల యత్నం