తెలంగాణ ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై హైకోర్టు విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన న్యాయస్థానం
తెలంగాణ ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ వివరాల నమోదుపై సీఎస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆధార్ వివరాలు....
తెలంగాణ ధరణి పోర్టల్‌లో ఆస్తుల నమోదుపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. రిజిస్ట్రేషన్ల కోసం ఆధార్ వివరాల నమోదుపై సీఎస్ హైకోర్టుకు నివేదిక సమర్పించారు. ఆధార్ వివరాలు ఇవ్వడం ఇష్టం లేని వారికి ప్రత్యామ్నాయం ఉందన్న ప్రభుత్వం… ఐచ్ఛికంగా కూడా ఆధార్ వివరాలు ఎలా అడుగుతారని హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది. ఆధార్ ఇవ్వడం ఇష్టమా లేదా అనే ప్రశ్న ఎందుకు ప్రభుత్వాన్ని కోర్టు ప్రశ్నించింది. స్లాబ్ బుకింగ్ కోసం 29పేజీల సమాచారం అడుగుతున్నారని పిటిషన్ దాఖలు కాగా, పిటిషనర్ తరపున న్యాయవాది ప్రకాశ్ రెడ్డి వాదించారు. స్లాట్ బుకింగ్ పేరుతో ప్రజలను గందరగోళం చేయవద్దని హైకోర్టు వ్యాఖ్యానించింది. క్రయ, విక్రయదారులతో పాటు సాక్షుల ఆధార్ వివరాలు అడగడాన్ని కోర్టు తప్పుబట్టింది.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను తప్పించుకునేందుకు ఇలా వ్యవహరిస్తోందని, ప్రభుత్వం న్యాయస్థానంలో నిజాయితీగా ఉండాలని సూచించింది. రిజిస్ట్రేన్లు నిలిపివేస్తూ ఆదేశించక తప్పదని హైకోర్టు తెలిపింది. అయితే ఆధార్, ఇతర అంశాలపై ప్రభుత్వాన్ని సంప్రదించి వివరణ ఇస్తానని ఏజీ తెలిపారు. దీనిపై విచారణ మధ్యాహ్నం 2.30 గంటల వరకు వాయిదా వేసింది.