నిమ్మగడ్డ ప్రెస్ మీట్: గతం మరిచి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి, కక్షసాధింపు చర్యలకు ఎప్పుడూ పాల్పడను

గతంలో జరిగిన విషయాలు పక్కనపెట్టి పంచాయతీ ఎన్నికలు సజావుగా సహకరించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ చెప్పారు. ఎన్నికల నిర్వహణకు..

నిమ్మగడ్డ ప్రెస్ మీట్: గతం మరిచి ఎన్నికలు సజావుగా జరిగేలా చూడండి, కక్షసాధింపు చర్యలకు ఎప్పుడూ పాల్పడను
Follow us

|

Updated on: Jan 27, 2021 | 6:42 PM

గతంలో జరిగిన విషయాలు పక్కనపెట్టి పంచాయతీ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు సహకరించాలని ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. ఆంధ్రప్రదేశ్ లో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయన బుధవారం సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. “గవర్నర్ తో ఈ రోజు భేటీ జరిగింది. గవర్నర్ గారు ఈ రోజు పిలిచారు. ప్రభుత్వంతో ఉన్న సమస్యలు ఏంటి.. అని అడిగారు. నేను కచ్చితంగా ప్రభుత్వం, ఎస్ ఈసీ మధ్య వివాదాలు లేకుండా పరిష్కరిస్తానని చెప్పారు.” అని నిమ్మగడ్డ విలేకరుల ముందు చెప్పారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, “సుప్రీంకోర్టు అనేక సూచనలు చేసింది. సీఎస్, డీజీపీతో నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. నాకు అధికారులతో ఎలాంటి సమస్య లేదని చెప్పాను. ఉద్యోగుల సంఘాలు విధుల్లో పాల్గొనటం స్వాగతిస్తున్నాను.” అని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ లో పేర్కొన్నారు. “ఈ రోజు 11 గంటలకు సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేశారు. ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లపై చర్చ జరిగింది. ఈ రోజు నుంచి లక్షణ రేఖ వచ్చింది. ఎన్నికల కమిషన్ ను నిందించడం తగదు. ప్రభుత్వ పెద్దలు ఆలోచించాలి. గవర్నర్, సీఎస్ కు ఇదే చెప్పాను. ఇద్దరు అధికారులపై ఈసీ చర్యలు తీసుకుంటే.. మంత్రి వ్యాఖ్యలు బాధాకరం.” అని నిమ్మగడ్డ అన్నారు. తాను కక్ష సాధింపు చర్యలకు పాల్పడలేదని క్లారిటీ ఇచ్చారు. “3.60 లక్షల యువత ఓటు హక్కు కోల్పోయారు. ఇద్దరు అధికారులపై చర్యలు తీసుకుంది వాస్తవం. వారిని అభిశంసన చేశాము. వారిని ఏమీ సస్పెండ్ చేయలేదు. కక్ష సాధింపు లేదు. ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహణ పంచాయతీ రాజ్ శాఖ కార్యదర్శి గిరిజా శంకర్ ఆధ్వర్యంలో నడిచింది. గతం గురించి వద్దు..అధికారులకు కూడా అదే చెప్పాను.” అని నిమ్మగడ్డ ప్రెస్ మీట్ ముగించారు.

Latest Articles
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
దంచికొట్టిన డుప్లెసిస్..RCB హ్యాట్రిక్ విక్టరీ..ప్లే ఆఫ్ రసవత్తరం
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
రేవన్న ఫ్యామిలీ విషయంలో వేణు స్వామిని ఏకిపారేస్తున్న నెటిజన్స్
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
ఆంధ్రా స్టైల్‌లో పీతల పులుసు ఇలా చేశారంటే.. ఇంట్లో సువాసనలే..
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
IPL యాడ్‌లో కల్కి.. దిమ్మతిరిగేలా చేస్తున్న ప్రభాస్‌ లుక్‌.!
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
క్రేజీ అప్డేట్.. మరో బాహుబలి వస్తోంది.! అనౌన్స్ చేసిన జక్కన్న.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
నేను టాలీవుడ్‌కు దూరమవ్వడానికి కారణం వాల్లే.. ఇలియానా.
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
ఎన్నికల బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేష్.!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
మీ కళ్లు కాంతివంతంగా ఉండాలంటే రోజూ ఒక పచ్చిమిర్చి తినండి..!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
శంకర్ డైరెక్షన్లో బంగారం లాంటి హిట్టు మిస్‌ చేసుకున్న చిరు.!
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..
కేజీఎఫ్ ని ఫాలో అవుతున్న పుష్ప రాజ్‌.! ఇక అక్కడ కూడా..