భక్తులతో కిక్కిరిసిన మేడారం.. జాతరకు ప్రత్యేక రైళ్లు..!

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. సుప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వేప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌- వరంగల్‌ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటు ఉంటాయని, ఇవి మౌలాలీ, […]

భక్తులతో కిక్కిరిసిన మేడారం.. జాతరకు ప్రత్యేక రైళ్లు..!

వరంగల్‌ జిల్లాలోని మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు భక్త జనసందోహం పోటెత్తింది.తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్దఎత్తున సమ్మక్క-సారక్కలను దర్శించుకుంటున్నారు. సుప్రసిద్ధ మేడారం జాతరకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడపనుంది. జాతరకు వచ్చే భక్తుల సౌకర్యార్థం 20ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణమధ్య రైల్వేప్రకటించింది. ఫిబ్రవరి 4 నుంచి 8వ తేదీ వరకు ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. హైదరాబాద్‌- సికింద్రాబాద్‌- వరంగల్‌ మీదుగా 10 ప్రత్యేక సర్వీసులు అందుబాటు ఉంటాయని, ఇవి మౌలాలీ, చర్లపల్లి, ఘట్‌కేసర్, బీబీనగర్, భువనగిరి, రాయ్‌గిరి, వంగపల్లి, ఆలేర్, పెంబర్తి, జనగామ, రఘునాథ్‌పల్లి స్టేషన్లలో ఆగుతాయని దక్షిణమధ్య రైల్వే వివరించింది.

మొదటిరోజు: ఫిబ్రవరి 5న బుధవారం నాడు సారలమ్మ, పగిదిద్దరాజు, గోవిందరాజులు గద్దెలకు చేరుకుంటారు. రెండోవరోజు: ఫిబ్రవరి 6న గురువారం నాడు సమ్మక్క గద్దెకు చేరుతుంది. మూడవరోజు: ఫిబ్రవరి 7న శుక్రవారం నాడు భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. నాల్గువరోజు: ఫిబ్రవరి 8న శనివారం దేవతల వన ప్రవేశం ఉంటుంది.

ఈ సందర్భంగా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా రాష్ట్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లను చేసింది. జాతర సందర్బంగా మేడారం మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్ అవుతోంది. కోట్లాది మంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని తరిస్తున్నారు. సిర్పూర్‌ కాగజ్‌నగర్- వరంగల్‌- సిర్పూర్‌ కాగజ్‌నగర్‌ మధ్య మరో 10 రైళ్లు నడవనున్నాయి. ఇవి ఆసిఫాబాద్, బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల, పెద్దంపేట, రామగుండం, రాఘవపురం, పెద్దపల్లి, జమ్మికుంట, కొత్తపల్లి, కొలనూర్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.

Published On - 6:16 pm, Sat, 1 February 20

Click on your DTH Provider to Add TV9 Telugu