DELHI…షాహీన్‌బాగ్ వద్ద కాల్పులు.. అదే ఉద్రిక్తత

ఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్ద శనివారం కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు  గాలిలోకి రెండు సార్లు ఫైర్ చేశాడని, మూడో సారి కూడా కాల్చబోగా అతని గన్ జామ్ అయిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. దీంతో ఆ ఆయుధాన్ని పొదల్లో పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారని […]

DELHI...షాహీన్‌బాగ్ వద్ద కాల్పులు.. అదే ఉద్రిక్తత
Follow us
Umakanth Rao

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Feb 01, 2020 | 6:33 PM

ఢిల్లీలోని షాహీన్‌బాగ్ వద్ద శనివారం కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. సీఏఏకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న నిరసనకారులపై ఓ వ్యక్తి కాల్పులకు దిగాడు. అయితే ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదు. కాల్పులు జరిపిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇతడు  గాలిలోకి రెండు సార్లు ఫైర్ చేశాడని, మూడో సారి కూడా కాల్చబోగా అతని గన్ జామ్ అయిందని ఓ ప్రత్యక్ష సాక్షి తెలిపాడు. దీంతో ఆ ఆయుధాన్ని పొదల్లో పడేసి పారిపోవడానికి ప్రయత్నించగా పోలీసులు పట్టుకున్నారని ఆయన చెప్పాడు. జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేసిన ఈ వ్యక్తి.. ‘ మా దేశంలో కేవలం హిందువులే ఉండాలి.. మరెవరూ ఉండడానికి వీల్లేదు’ అని కేకలు పెట్టాడట. ఇతడిని కపిల్ అనే వ్యక్తిగా గుర్తించారు. రెండు రోజుల క్రితమే జామియా మిలియా యూనివర్సిటీ వద్ద ఓ యువకుడు జరిపిన కాల్పుల్లోఒక విద్యార్ధి గాయపడిన సంగతి తెలిసిందే.  సవరించిన పౌరసత్వ చట్టానికి నిరసనగా షాహీన్ బాగ్ వద్ద నెలరోజులుగా ఆందోళనకారులు ధర్నా చేస్తున్నారు. వీరిలో అనేకమంది మహిళలు కూడా ఉన్నారు.