విపక్షాలకు సుప్రీంలో ఎదురు దెబ్బ..! వీవీప్యాట్లను లెక్కించలేమని..
విపక్షాలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనన్న విపక్షాల పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. టీడీపీ సహా 21 విపక్ష పార్టీల వాదనను కూడా వినేందుకు నిరాకరించింది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. నియోజక వర్గంలో 5 శాతం వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించాలని ఇదివరకే ఈసీని సుప్రీం ఆదేశించింది. సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యను పెంచాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును […]

విపక్షాలకు సుప్రీంకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. వీవీప్యాట్లను లెక్కించాల్సిందేనన్న విపక్షాల పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. టీడీపీ సహా 21 విపక్ష పార్టీల వాదనను కూడా వినేందుకు నిరాకరించింది. 50 శాతం వీవీప్యాట్ స్లిప్పుల్ని లెక్కించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే.. నియోజక వర్గంలో 5 శాతం వీవీప్యాట్ల స్లిప్పుల్ని లెక్కించాలని ఇదివరకే ఈసీని సుప్రీం ఆదేశించింది.
సార్వత్రిక ఎన్నికల ఫలితాల సందర్భంగా వీవీప్యాట్ స్లిప్పుల సంఖ్యను పెంచాలంటూ ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని ప్రతిపక్ష పార్టీలు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. దీనిపై ఇటీవల విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఒక శాసనసభ నియోజకవర్గంలోని 5 వీవీప్యాట్ల స్లిప్పులను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నమోదైన ఓట్లతో సరిపోల్చాలని ఎన్నికల కమిషన్‌ను ఏప్రిల్ 8న ఆదేశించింది.
అయితే.. ఈ తీర్పును మళ్లీ పరిశీలించాలని కోరుతూ విపక్షాలు మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించాయి. శాసనసభ నియోజకవర్గం పరిధిలో కనీసం 50శాతం వీవీప్యాట్లను లెక్కించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ రివ్యూ పిటిషన్ దాఖలు చేశాయి. వీవీప్యాట్ చీటీల లెక్కింపును ఒకటి నుంచి అయిదుకు చేయడం సహేతుకమైన సంఖ్య కాదు. అది సంతృప్తి కలిగించేదీ కాదని ప్రతిపక్ష పార్టీలు పిటిషన్‌లో పేర్కొన్నాయి. అయితే.. ఈ రివ్యూ పిటిషన్లను విచారించేందుకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం అంగీకరించలేదు.



