AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విమానాశ్రయాలు, చమురు కేంద్రాలే టార్గెట్.. సౌదీ అరేబియాపై హౌతీల భీకర దాడులు.. భారత్ కీలక ప్రకటన..

సౌదీ అరేబియాలో విమానాశ్రయాలు, కీలక మౌలిక సదుపాయాలపై హౌతీల దాడుల నేపథ్యంలో ఉద్రిక్తతలు పెరిగాయి. భద్రతా ముప్పు దృష్ట్యా సౌదీలోని అత్యవసరం కాని అమెరికా ప్రభుత్వ సిబ్బంది, వారి కుటుంబాలను వెనక్కి వెళ్లాలని అమెరికా ఆదేశించింది. ఈ పరిణామాలు గల్ఫ్ ప్రాంత భద్రత, అంతర్జాతీయ చమురు సరఫరాపై ఆందోళనలను పెంచుతున్నాయి.

విమానాశ్రయాలు, చమురు కేంద్రాలే టార్గెట్.. సౌదీ అరేబియాపై హౌతీల భీకర దాడులు.. భారత్ కీలక ప్రకటన..
Saudi Arabia Houthi Attacks
Shaik Madar Saheb
|

Updated on: Oct 22, 2026 | 10:07 AM

Share

పశ్చిమాసియా మరోసారి భీకర యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది. సౌదీ అరేబియా లక్ష్యంగా యెమెన్‌కు చెందిన హౌతీ రెబెల్స్ దాడులను మరింత తీవ్రతరం చేశారు. కీలకమైన విమానాశ్రయాలు, చమురు నిల్వ కేంద్రాలే టార్గెట్‌గా డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడుతుండటంతో గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సౌదీలోని వ్యూహాత్మక కింగ్ ఫహద్ విమానాశ్రయంపై హౌతీలు జరిపిన మెరుపు దాడిలో ఒకరు ప్రాణాలు కోల్పోగా, మరో 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేసే చమురు కేంద్రాలపై కూడా రెబెల్స్ పంజా విసిరారు. షైబా ఆయిల్ ఫీల్డ్‌పై జరిగిన డ్రోన్ దాడిలో మరో ఇద్దరు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి.

కాగా.. సౌదీ రక్షణ బలగాలు అప్రమత్తంగా వ్యవహరించి, తూర్పు ప్రాంతంలో దూసుకొచ్చిన నాలుగు హౌతీ డ్రోన్లను గాలిలోనే విజయవంతంగా కూల్చివేశాయి. అయినప్పటికీ, రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై ఇటీవల జరిగిన ప్రాణాంతక దాడుల కారణంగా పలు కీలక విమాన సర్వీసులు రద్దయ్యాయి.

అప్రమత్తమైన అమెరికా – దౌత్యవేత్తలకు ఆదేశాలు:

సౌదీ అరేబియాలో భద్రతా ముప్పు నానాటికీ పెరిగిపోతుండటంతో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. సౌదీలో పరిస్థితులు ఆందోళనకరంగా మారుతున్న నేపథ్యంలో, అక్కడి తమ దౌత్యవేత్తలు మరియు సిబ్బంది వెంటనే వెనక్కి వచ్చేయాలని అమెరికా ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

భారత్ ఆందోళన – శాంతి కోసం పిలుపు:

పశ్చిమాసియాలో రాజుకుంటున్న ఈ యుద్ధ మేఘాలు, అంతర్జాతీయ చమురు సరఫరా మరియు గల్ఫ్‌లో నివసిస్తున్న లక్షలాది మంది భారతీయుల భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఈ పరిణామాలపై భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఎలాంటి సంక్షోభాలనైనా సరే ఆయుధాలతో కాకుండా కేవలం చర్చల ద్వారానే శాంతియుతంగా పరిష్కరించుకోవాలని భారత విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు.

భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలి..

ఫ్రాన్స్‌లోని కొనసాగుతున్న అశాంతి, స్థానిక కర్ఫ్యూల దృష్ట్యా, ఆ దేశంలో నివసిస్తున్న లేదా ప్రయాణిస్తున్న భారత పౌరులు అత్యంత జాగ్రత్త వహించాలని, అప్రమత్తంగా ఉండాలని కోరుతూ పారిస్‌లోని భారత రాయబార కార్యాలయం ఒక భద్రతా సలహాను జారీ చేసింది. నిరసన ప్రదేశాలకు, బహిరంగ ప్రదర్శనలకు దూరంగా ఉండాలని పౌరులకు సలహా ఇస్తూ, రాయబార కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. “ఫ్రాన్స్‌లో ఇటీవలి పరిణామాలు – విధించిన స్థానిక కర్ఫ్యూల దృష్ట్యా, దయచేసి అప్రమత్తంగా ఉండండి, తగిన జాగ్రత్తలు తీసుకోండి. నిరసనలు జరుగుతున్న పెద్ద సమూహాలకు, రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండండి, అలాగే స్థానిక ఫ్రెంచ్ అధికారులు జారీ చేసిన సూచనలు – సలహాలను పాటించండి.” అంటూ కోరింది.

Follow Us