AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దీపావళి పూజలో లక్ష్మీదేవిని ఎలా ప్రసన్నం చేసుకోవాలో తెలుసా!

దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరూ లక్ష్మీ పూజ చేస్తుంటారు. ముఖ్యంగా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవడానికి ప్రత్యేక పూజలు చేయడం, ఉపవాస దీక్ష చేపట్టడం చేస్తుంటారు. అయితే మీరు కూడా లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవాలి అనుకుంటున్నారా? అయితే మీ కోసమే ఈ సమాచారం.

Samatha J
|

Updated on: Oct 22, 2026 | 9:42 AM

Share
హిందూ మతంలో జరుపుకునే అతి పెద్ద పండుగలో దీపావళి కూడా ఒకటి. ఈ రోజున ప్రతి ఒక్కరూ గణేశుడిని, లక్ష్మీదేవిని పూజిస్తుంటారు. ముఖ్యంగా దీపావళికి ముందే ఇంటిని శుభ్రం చేసి, దీపావళి రోజు ఇంటిని అందంగా అలంకరించుకుంటారు.  అయితే మీరు ఈ పండుగ  సమయంలో ఇంటిని శుభ్రం చేసి, అలంకరించే సమయంలో తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలంట. అవి ఏవో చూసేద్దాం.

1 / 5
దీపావళి సమయంలో వాస్తు ప్రకారం ప్రధానం ద్వారం విషయంలో తప్పకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకు అంటే, ఇంటిలో ప్రధాన ద్వారం శక్తితో ముడిపడి ఉంటుంది. అందువలన ప్రధాన ద్వారం వద్ద బూట్లు , చెప్పులు, చెత్త లేకుండా చూసుకోవాలి. శుభ్రం చేసి, బంతిపూల దండలతో అందంగా అలంకరించుకోవాలి.

2 / 5
తప్పకుండా ప్రధాన ద్వారం వద్ద మామిడి ఆకు తోరణాలు కట్టాలి. అలాగే ప్రధాన ద్వారానికి స్వస్తిక్  చిహ్నం గీయాలి. దీని వలన మీ ఇంటికి అదృష్టం కలిసి వస్తుంది. దీని వలన ప్రతికూల శక్తులు నశించి, సానుకూలత పెరుగుతుంది. అంతే కాకుండా లక్ష్మీదేవి అనుగ్రహం కూడా కలుగుతుంది.

3 / 5
వాస్తు శాస్త్రం ప్రకారం, ఇంటిలో ఈశాన్య మూల చాలా శుభ్రంగా ఉంచడం అవసరం. పూజకు ఈ మూల చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది. అందువలన ఇంటిలో ఎప్పుడైనా సరే ఈశాన్య మూల చాలా శుభప్రదంగా ఉండేలా చూసుకోవాలి. ఆ ప్రదేశంలో విరిగిన, పాత వస్తువులు ఉంచడం మంచిది కాదు. ఎప్పుడు కూడా ఈ ప్రదేశంలో చెత్త పేరుకపోకుండా చూసుకోవాలి. అప్పుడే ఇంటిలో సంపద వర్షం కురుస్తుంది.

4 / 5
అలాగే పూజ గది కూడా అందంగా అలంకరించి ఉండాలి. ఈ ప్రదేశంలో పాత సామాను ఉండటం మంచిది కాదు. ముఖ్యంగా దీపావళి సమయంలో పూజ గది చాలా బాగుండాలి. అలాగే  దీపావళి రోజున లక్ష్మీదేవి, గణేశుడిని పూజించడానికి వారి విగ్రహాలు ఒకే చోట ఉంచాలి. ముఖ్యంగా ఇంటికి తూర్పు లేదా ఉత్తరం దిశలో ఉంచడం చాలా మంచిది. పూజ స్థలంపై ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి, అమ్మవారిని పూజించాలి.

5 / 5
Follow Us