కేదార్‌నాథ్ చేరిన సంతోష్ సంకల్పం
కేసీఆర్ సమీప బంధువు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పం హిందువుల పవిత్ర క్షేత్రం, హిమాలయాలలో చార్ ధామ్ ఆలయం కేదార్‌నాథ్‌కు చేరింది. సంతోష్ కుమార్...
Santosh challenge reached Kedarnath: కేసీఆర్ సమీప బంధువు, రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ సంకల్పం హిందువుల పవిత్ర క్షేత్రం, హిమాలయాలలో చార్ ధామ్ ఆలయం కేదార్‌నాథ్‌కు చేరింది. సంతోష్ కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొత్త ప్రాంతాలకు చేరుతోంది. దేశం నలుమూలలా విస్తరిస్తోందనడానికి తాజాగా కేదార్‌నాథ్ క్షేత్రంలో కొందరు నిర్వహించిన గ్రీన్ ఇండియా ట్రీ ప్లాంటేషన్ కార్యక్రమమే నిదర్శనంగా నిలుస్తోంది.
యూత్ హాస్టల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సభ్యులు అల్ఫా పటేల్, మృణాళినీ ఉపాధ్యాయ్, నితేశ్ జైన్, శ్రీకాంత్ చార్ ధామ్ క్షేత్రాలలో ఒకటైన కేదార్‌నాథ్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కింద మొక్కలను నాటారు. కేదార్‌నాథ్ ఆలయానికి సమీపంలో మొక్కను నాటుతున్న ఫోటోను వారు ట్వీట్ చేశారు.
తాను రాజ్యసభ సభ్యునిగా ఎన్నికైన నాటి నుంచి తనదైన శైలిలో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ పేరిట మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రోత్సహిస్తున్న సంతోష్ కుమార్.. తాజాగా సినీ నటులను ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా ప్రోత్సహిస్తున్నారు. ఆదివారం ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి తనయుడు, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా పాల్గొన్నారు.
ALSO READ: పార్టీ స్టాండ్‌కు వ్యతిరేకంగా టీడీపీ నేత ఫ్లెక్సీలు