ఏమైనా సరే.. దాన్ని వదిలేది లేదంటున్న సల్మాన్ ఖాన్..

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల్లో బిగ్ బాస్ నుంచి తప్పుకోనున్నాడని వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 13 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మరోవైపు ఈ షోను ఐదు వారాలు పొడిగించి ఫిబ్రవరిలో పూర్తి చేయనున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా ఉండటంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సల్మాన్ ఖాన్ షో నుంచి వైదొలుగుతాడని ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. […]

ఏమైనా సరే.. దాన్ని వదిలేది లేదంటున్న సల్మాన్ ఖాన్..
Follow us

|

Updated on: Dec 12, 2019 | 9:40 PM

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కొద్దిరోజుల్లో బిగ్ బాస్ నుంచి తప్పుకోనున్నాడని వార్తలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రస్తుతం హిందీ బిగ్ బాస్ సీజన్ 13 ఎంతో ఆసక్తికరంగా సాగుతోంది. మరోవైపు ఈ షోను ఐదు వారాలు పొడిగించి ఫిబ్రవరిలో పూర్తి చేయనున్న సంగతి తెలిసిందే. హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య టైటిల్ పోరు రసవత్తరంగా ఉండటంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ తరుణంలో సల్మాన్ ఖాన్ షో నుంచి వైదొలుగుతాడని ఊహాగానాలు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నాయి. సల్మాన్ ప్లేస్‌లో డాన్స్ మాస్టర్ ఫరా ఖాన్ హోస్టుగా రానున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి. అయితే అవన్నీ వట్టి రూమర్లేనని సల్మాన్ సన్నిహిత వర్గం కొట్టిపారేశారు.

గత పదేళ్లుగా బిగ్ బాస్ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న సల్మాన్ షో నుంచి తప్పుకోవడం లేదని వారు పేర్కొన్నారు. ప్రస్తుతం నడుస్తున్న సీజన్ 13లో కంటెస్టెంట్ల మధ్య గొడవలను సాత్వికంగా పరిష్కరించడానికి ప్రయత్నిస్తున్నాడని చెప్పుకొచ్చారు. ఇకపోతే సల్మాన్ గత కొద్ది సంవత్సరాలుగా ఓ విచిత్రమైన సమస్యతో బాధపడుతున్నాడు. దాన్ని నుంచి ఆయన కోలుకున్నప్పటికీ.. అది మళ్ళీ తిరగబడుతుందేమోనని కుటుంబసభ్యులు భయపడుతున్నట్లు తెలుస్తోంది. ఇక బిగ్ బాస్ 13లో సిద్ధార్థ్ శుక్లా, రష్మీ దేశాయ్‌లు టైటిల్ వేటలో ముందున్నట్లు చెప్పవచ్చు.