‘ఆదిపురుష్’ లో లంకేశ్ గా సైఫ్ అలీఖాన్

టాలీవుడ్ యాక్ట‌ర్ ప్ర‌భాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా తెర‌కెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది.

‘ఆదిపురుష్’ లో లంకేశ్ గా సైఫ్ అలీఖాన్
Follow us
Balaraju Goud

|

Updated on: Sep 03, 2020 | 11:06 AM

టాలీవుడ్ యాక్ట‌ర్ ప్ర‌భాస్ హీరోగా ఆదిపురుష్ సినిమా తెర‌కెక్కబోతోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ క‌నిపించ‌నున్నట్లు చిత్రం యూనిట్ ప్రకటించింది. తానాజీ ఫేం ఓం రావ‌త్ డైరెక్ష‌న్ లో తెరకెక్కనున్న ఈ చిత్రం జ‌న‌వ‌రి లో సెట్స్ పైకి వెళ్ల‌నుంది. రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విల‌న్ గా నటించనున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చిన సంగతి తెలిసిందే. ఆదిపురుష్ చిత్రంలో లంకేశ్ గా సైఫ్ అలీఖాన్ న‌టిస్తున్న‌ట్టు అధికారికంగా ప్ర‌క‌టించారు. సైఫ్ అలీఖాన్ తానాజీ చిత్రంలో ఇప్ప‌టికే విల‌న్ గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించాడు.

తాజాగా ఓం రావ‌త్ డైరెక్ష‌న్ లో మ‌రో సినిమాలో సైఫ్ న‌టిస్తున్నాడు. రామాయ‌ణం ఆధారంగా వ‌స్తోన్న ఈ చిత్రంలో ప్ర‌భాస్ రాముడి పాత్ర‌లో క‌నిపించ‌నున్నాడు. ఆదిపురుష్ చిత్రాన్ని హిందీ, తెలుగుతో సహా ఐదు భాష‌ల్లో ఏక‌కాలంగా చిత్రీక‌రించ‌నున్నారు. ఈ చిత్రాన్ని భూష‌న్ కుమార్, క్రిష్ణన్ కుమార్‌, ఓం రావ‌త్‌, ప్ర‌సాద్ సుతార్, రాజేశ్ నాయ‌ర్ నిర్మిస్తున్నారు. బాలీవుడ్, టాలీవుడ్ చిత్ర పరిశ్రమల్లో ఈ మూవీ సంచలనం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.