AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మ‌రోసారి త‌న పెళ్లి వార్తలపై స్పందించిన మెగా హీరో.. బాధ్యతలు పూర్తయ్యాకే వివాహమ‌ని ప్రకటన..

ఇటీవల సాయిధరమ్ తేజ్ పెళ్లి విషయంపై ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. సాయి ధరమ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకోనున్నాడని, లేదు.. పెద్దలు కుదిర్చిన వివాహమే అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే సాయి ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు.

మ‌రోసారి త‌న పెళ్లి వార్తలపై స్పందించిన మెగా హీరో.. బాధ్యతలు పూర్తయ్యాకే వివాహమ‌ని ప్రకటన..
Anil kumar poka
| Edited By: |

Updated on: Dec 16, 2020 | 5:23 PM

Share

Sai dharam tej open up about his marriage: ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమాతో వెండితెరకు ఎంట్రీ ఇచ్చారు మెగా హీరో సాయి ధరమ్ తేజ్. నటన విషయంలో తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసిన సాయికి విజయాన్ని అందుకోవడానికి మాత్రం కాస్త సమయమే పట్టింది. వరుస పరాజయాల తర్వాత ‘చిత్ర లహరి’, ‘ప్రతి రోజు పండగే’ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కారు సాయి ధరమ్ తేజ్. ఇక ప్రస్తుతం ‘సోలో లైఫే సో బెటర్’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను పలకరించడానికి సిద్ధమయ్యారు. ఇదిలా ఉంటే ఇటీవల సాయిధరమ్ తేజ్ పెళ్లి విషయంపై ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంది. సాయి ధరమ్ తేజ్ ప్రేమ వివాహం చేసుకోనున్నాడని, లేదు.. పెద్దలు కుదిర్చిన వివాహమే అంటూ పుకార్లు షికార్లు చేశాయి. అయితే సాయి ఆ వార్తలను ఎప్పటికప్పుడు ఖండిస్తూనే ఉన్నారు. తాజాగా మెగా డాటర్ నిహారిక వివాహం జరిగిన నేపథ్యంలో.. మెగా ఫ్యామిలిలో జరగబోయే తర్వాతి వివాహం సాయి ధరమ్ తేజ్‌దే అంటూ మరోసారి వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై సాయి మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాదు మెగా ఫ్యామిలిలో మరో హీరో పెళ్లి కొడుకు కానున్నట్లు కూడా తేల్చేశారు. వచ్చే ఏడాది అల్లు శిరీష్‌ వివాహం జరగనుందని సాయి హింట్ ఇచ్చారు.

ఈ విషయమై సాయి ధరమ్ తేజ్ మాట్లాడుతూ.. ‘శిరీష్‌ నా కంటే పెద్ద.. తను వచ్చే ఏడాది పెళ్లి చేసుకుంటాడు. ఇంటి పెద్ద కొడుకిగా నాపై కొన్ని బాధ్యతలు ఉన్నాయి, వాటిని పూర్తి చేయాలి. అంతేకాకుండా పెళ్లి చేసుకోవడం కంటే సోలోగా ఉంటేనే నాకు సంతోషంగా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఎన్నో మిస్ అయ్యాను. చాలా కలలున్నాయి, ముందు వాటిని నేరవేర్చుకోవాలి’ ఆ తర్వాతే పెళ్లి విషయం గురించి ఆలోచిస్తాను’ అని చెప్పుకొచ్చారు సాయి ధరమ్ తేజ్. ఈ లెక్కన వచ్చే ఏడాది అల్లు వారి అబ్బాయి పెళ్లి పీటలు ఎక్కడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇటీవల ఓ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సాయి ధరమ్ తేజ్ తన అపజయాల గురించి మాట్లాడుతూ.. ‘ఫ్లాప్ అయిన సినిమాల ద్వారానే నేను ఎక్కువ నేర్చుకున్నాను. కథ నచ్చకపోతే ‘నో’ చెప్పడం అలవాటు చేసుకున్నాను’ అని చెప్పుకొచ్చారు. ఇక సాయి ప్రస్తుతం దేవకట్ట ద‌ర్శక‌త్వంలో తెరకెక్కుతోన్న చిత్రంలో నటిస్తున్నారు.